రామగుండం నవంబర్ 13 (ఈతరం ఇండియా న్యూస్ ): ఎన్నికల ప్రచారంలో భాగంగా రామగుండం పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో 20, 21, 22 డివిజన్ లో నిర్వహించిన పాద యాత్రలో కార్యక్రమంలో రామగుండం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ పాల్గొని ఇంటింటా ప్రజలను కలిసి చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.ఈ సందర్బంగా రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ,బీ పవర్ ప్లాంట్ ను ముసివేసి రామగుండం ప్రాంతన్ని చీకటి మాయం చేయాలని బిఆర్ఎస్ చూస్తుందని ఆరోపించారు.ఈ ప్రాంతం బాగుపడాలి, దోపిడి జరుగవద్దు, ప్రశ్నించేవారు ఉండాలని అన్నారు.స్థానిక శాసన సభ్యుడు అసమర్థతతో ఈ ప్రాంతం అభివృద్ధి కాలేదని ఆరోపించారు.. కుందన్ పల్లి బూడిదను అమ్ముక్కుంటున్నాడు అని అన్నారు. కుందన్ పల్లి ప్రజలకు అండగా ఉంటానని, గ్రామ సమస్యలు పరిష్కరిస్తానని అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఆటో డ్రైవర్లను కార్మికులుగా గుర్తించి వారికి ఇండ్లు ఇస్తామని, సొంత స్థలం ఉంటే 5 లక్షల రూపాయలు ఇంటి నిర్మాణానికి ఇస్తామని అన్నారు. ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి ₹10,000 ఆర్థికంగా ఇస్తామని తెలిపారు.బీఆర్ఎస్ పార్టీ అడ్డగోలుగ, ఉద్యోగాల దోపిడి, బూడిద దోపిడి, ఇసుక దోపిడి చేసి అక్రమంగా సంపాదించిన డబ్బుతో 10వేలు రూపాయలు ఇచ్చి ఓట్లు కొందమని వస్తున్నారని, వారికి ప్రజలే బుద్ధి చెప్పాలని ఆయన అన్నారు .రామగుండంలో పవర్ ప్లాంట్ ను ప్రాంభించి స్థానికులకు ఉద్యోగ అవకాశం కల్పిస్తానని అన్నారు.బిఆర్ఎస్ పార్టీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, దళిత బందు, బీసీ బందు, మైనారిటీ బందు, ఇంటికొ ఉద్యోగం, మైనారిటీలకు 12శాతం రిజర్వేషన్ ఇస్తామని అని చెప్పి మోసం చేశారని అన్నారు.