Eetaram Bharatam ఈతరం భారతమ్
Search
📗Eetaram Bharatam Journal Coming Soon.📕

వర్షానికి పిడుగు పడి దాదాపు 20 మేకలు మృతి

సదాశివపేట ఏప్రిల్ 3 (ఈతరం భారతం );తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో పలు ప్రాంతాల్లో విషాద సంఘటనలు చోటుచేసుకున్నాయి. వర్షానికి పిడుగు పడి దాదాపు 20 మేకలు మృతి చెందాయి. సంగారెడ్డి జిల్లాలోని సదాశివపేట మండలం ఇషిర్థబాద్‌లో ఈ ఘటన జరిగింది.గ్రామంలోని లచ్చయ్యకు చెందిన 20 మేకలు పిడుగుపాటుకు మృతి చెందాయి. దీంతో గొర్రెల కాపరి లచ్చయ్య కన్నీరు మున్నీరయ్యారు.ఇక, సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ మండలం జాలిగామ శివారులో ఉన్న ఓ గోదాం ప్రహరీ గోడ వర్షం కారణంగా కూలి ఒకరు చనిపోయారు. మృతుడిని గజ్వేల్‌కు చెందిన ఇమ్మత్‌ఖాన్‌(55)గా గుర్తించారు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రo ప్రకటించింది

.

 

Related News

Select the Topic
Scroll to Top

Web Design, Data Processing, Data Entry in Telugu, English & Hindi,
Flyer Designing for Social Media, Video Flyers, Social Media Postings. WhatsApp: 8919646204

Web Design, Data Processing, Data Entry in Telugu, English & Hindi,
Flyer Designing for Social Media, Video Flyers, Social Media Postings. WhatsApp: 8919646204