ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైనది – డాక్టర్ లిల్లీ మేరి
సిద్దిపేట సెప్టెంబర్ 12 (ఈతరం భారతం);: గురువులను దైవంగా భావించే సంస్కృతి మనదని, తల్లిదండ్రుల తర్వాత గురువులదే స్థానమని ప్రభుత్వ నర్సింగ్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ మరియు ప్రభుత్వ నర్సింగ్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ లిల్లీ మేరి అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారంనాడు ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో నిర్వహించిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని ఉపాధ్యాయ దినోత్సవం గా జరుపుకుంటామని, గురువులు పౌరులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని ఆమె కోరారు. ప్రతి గురువు శిష్యులు తన కన్నా ఉన్నతమైన స్థానంలో ఉండాలని, సమాజంలో గౌరవాన్ని దక్కించుకుంటే అదే తమకు గర్వ కారణంగా భావిస్తామని అంటూ అజ్ఞానాన్ని తొలగించి విజ్ఞానాన్ని అందించే అవకాశం ప్రపంచంలో ఒక ఉపాధ్యాయుడికే దక్కుతుందని లిల్లీ మేరి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులందరినీ శాలువాలు, మెమెంటోళ్ళతో వైస్ ప్రిన్సిపల్ లిల్లీ మేరి సత్కరించారు