సూర్యపేట నవంబర్ 11 (ఈతరం ఇండియా న్యూస్ );ప్రజాభిమానంతో కాంగ్రెస్ కార్యకర్తలు అండదండలతో విజయం సాధిస్తానని మాజీ మంత్రి సూర్యపేట కాంగ్రెస్ అభ్యర్థి రామిరెడ్డి దామోదర్ రెడ్డి అన్నారు. సూర్యాపేట నియోజకవర్గంలో మార్పు రావాలి మంచి జరగాలంటే కాంగ్రెస్ గెలవాలి అని ప్రజలంతా భావిస్తున్నారని రాష్ట్రంలో కెసిఆర్ పాలన సూర్యాపేటలో జగదీశ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ప్రజలంతా ఓటు వేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 50 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీ విధేయత ఉన్న తమ కుటుంబం ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కాంగ్రెస్ పార్టీ జెండా వీడలేదని ఆ విశ్వాసంతోనే కాంగ్రెస్ అధిష్టానం తనపై నమ్మకం ఉంచిందని తనకు సహకరించి గెలిపించిన వారందరికీ భవిష్యత్తులో తన సహకారం ఉంటుందని ఇప్పుడు కష్టకాలంలో ఉన్న కాంగ్రెస్ ను ఆదుకోవడానికి కార్యకర్తలకు గుండె ధైర్యం చెప్పడానికి తనని గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మంత్రి జగదీశ్వర్ రెడ్డి అక్రమార్జన తో సంపాదించిన వందలాది కోట్లతో తిరిగి ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని, ఎన్నికల్లో ఆయనకు ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతో సమన్వయంతో పనిచేసి అందరి సమస్యలు తీరిపోతాయి అని ఆయన ధైర్యం పలికారు