వనపర్తి మార్చి 1 (ఈ తరంం భారతం ); వనపర్తి జిల్లా కొత్తకోట మండలం పామాపురం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు శనివారం స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులుగా తోటి విద్యార్థులకు పాఠాలు బోధించి పలువురిని ఆకట్టుకున్నారు. విద్యార్థులు కలెక్టర్, డీఈవో, ఎంఈవోలుగా పాఠశాలకు రావడం ఆకర్షించింది. విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి పాఠాలు చెప్పడంతో పాటు, కలెక్టర్ గా శ్రీ వల్లి, డీఈవోగా అబ్దుల్ ఇమ్రాన్, ఎం.ఇ.ఒ.గా శ్రీకాంత్, గజిటెడ్ హెచ్.ఎంగా చందులతో పాటు మొత్తం 26 మంది విద్యార్థులు ఉపాధ్యాయులుగా ఇతర విద్యార్థులు వ్యవహరించారు. డీఈవోగా, ఎంఈవోగాలు పాఠశాలను సందర్శించి పరిశీలించడం, తనిఖీలు చేసి భళా అన్నించుకున్నారు.ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులు ఉపాధ్యాయులు గా బోధించిన, మరియు ప్రథమ స్థానం సాధించిన విద్యార్థులకు షీల్డ్,బహుమతులు అందజేశారు. అనంతరం సామూహిక భోజనాలు చేశారు.కార్యక్రమం లో పాఠశాల హెచ్. ఎం. రవి, తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు