13.06.2024 ఈతరం భారతం రీజినల్ నెట్వర్క్ ఇంచార్జ్ మధుశ్రీ నలుబోల,
వరంగల్ బస్టాండ్ నుంచి నెక్కొండ-మహబూబాద్‌కు వెళ్లే ఆర్టీసీ బస్సులో ఒక మహిళ తన ఇద్దరు కుమార్తెలను ఎక్కించారు. దివ్యాంగుడైన కుమారుడిని లోపలికి ఎక్కించేందుకు సదరు మహిళ కిందకు దిగగా.. బస్సు డ్రైవర్ ఆమె ఎక్కక ముందే బస్సును పోనిచ్చాడు.
దీంతో ఆ మహిళ ఆటోలో బస్సు వద్దకు వచ్చి రోడ్డుపై బస్సుకు అడ్డంగా కూర్చొని నిరసన వ్యక్తం చేసింది.