EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
📗Eetaram Bharatam Journal Coming Soon.📕

అంగన్‌వాడీలో కుమార్తెను చేర్చిన కలెక్టర్‌…

అంగన్‌వాడీలో కుమార్తెను చేర్చిన కలెక్టర్‌

ఈతరం భారతం రీజనల్ నెట్వర్క్ ఇంఛార్జి నలుబోల మధు శ్రీ 28.8.24

చిత్రంలో కనిపిస్తున్నది కుమురంభీం ఆసిఫాబాద్‌ కలెక్టరేట్‌ భవన సముదాయంలోని అంగన్‌వాడీ కేంద్రం. మంగళవారం ఉదయం కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అక్కడకు వచ్చారు. దీంతో సిబ్బంది అంతా ఆయన అంగన్‌వాడీ కేంద్రం పరిశీలనకు వచ్చారని భావించారు. ఆయన తన నాలుగేళ్ల కుమార్తె స్వర(తెల్లగౌనులో ఉన్న బాలిక)ను అందులో చేర్పించి ఉద్యోగులకు ఆదర్శంగా నిలిచారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ చిన్నారులకు ఇక్కడ పౌష్టికాహారం అందించడంతోపాటు ఆటపాటలతో కూడిన విద్యను నేర్పుతారని అందుకే చేర్చినట్లు తెలిపారు.

Related News

Select the Topic
Scroll to Top