ఇల్లెందు, ఫిబ్రవరి 20 (ఈతరం భారతం );: ఆయన ఒక మధ్యతరగతి సాధారణ కుటుంబంలో పుట్టారు. ఉన్నత చదువులు చదివి జిల్లా కలెక్టర్ అయ్యారు. విధి నిర్వహణలో భాగంగా ఉపాధి కూలీ పనులను పరిశీలించడానికి వచ్చారు. చూసి ఊరికే ఉండకుండా ఉపాధి కూలీలతో కలిసి పలుగు పట్టి మట్టిని తవ్వి, పారతో మట్టిని తట్టలో ఎత్తి మోశారు. ఆయనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ . గురువారం ఉదయం కలెక్టర్ జితేష్ పాటిల్.. టేకులపల్లి మండలంలోని సులానగర్, చింతలంక, కోయగూడెం, చంద్రు తండా, కొత్త తండా గ్రామపంచాయతీలలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఉపాధి కూలీలతో కలిసి పలుగు పారా పట్టి పారం పాండు పనుల్లో పాల్గొన్నారు. స్వయంగా మట్టిని తట్టలోకి ఎత్తి దానిని మోశారు.
