ఈతరం భారతం హైదరాబాద్ ప్రతినిధి ఏప్రిల్ 19 : అక్టోబర్‌లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక ఉంటుందని అలాగే, ఇకపై డిజిటల్ సభ్యత్వాలు తీసుకోవాలని నిర్ణయించామని మాజీ మంత్రి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ చెప్పారు. బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలు, వరంగల్ సభ తర్వాత కొత్తగా సభ్యత్వాలు తీసుకుంటామని చెప్పారు. శనివారం తెలంగాణ భవన్‌లో గ్రేటర్ హైదరాబాద్ బిఆర్ఎస్ నేతలతో కెటిఆర్ సమావేశమయ్యారు. బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు ఈ సమావేశానికి హాజరయ్యారు.ఈ సందర్భంగా రజతోత్సవ కార్యక్రమాలు, వరంగల్ బహిరంగ సభపై నేతలకు ఆయన దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ.. కార్యకర్తలకు ట్రైనింగ్ ఇప్పిస్తామని.. కార్యకర్తలకు విషయాలపై అవగాహన ఉంటేనే మాట్లాడగలరన్నారని కెటిఆర్ అన్నారు.