ఈతరం భారతం హైదరాబాద్ ప్రతినిధి ఏప్రిల్ 11: డా.బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో సామాజిక సాధికారత ఉత్సవంలో భాగంగా గురువారం సాయంత్రం విశ్వవిద్యాలయ అంబేద్కర్ విగ్రహ ప్రాంగణం (జ్ఞాన వనం) లో సాహిత్య సమ్మేళనం నిర్వహించారు. ముఖ్య అతిధిగా విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ఘంటా చక్రపాణి, విశిష్ట అతిథిగా ఆచార్య పిల్లలమర్రి రాములు, గౌరవ అతిధిగా ఆచార్య జి. పుష్పా చక్రపాణి, రిజిస్ట్రార్ డా. ఎల్వికే రెడ్డి పాల్గొని ప్రారంభించారు. సభాద్యక్షురాలుగా తెలుగు శాఖ ఆచార్యులు ఎన్. రజిని వ్యవహిరించారు. సాహిత్య సమ్మేళనంలో ప్రత్యేక ఆహ్వానితులుగా యాకూబ్, డా. ఏనుగు నరసింహ రెడ్డి, తగుళ్ళ గోపాల్, ఆచార్య శిఖామణి, డా. కోయి కోటేశ్వర రావు, దర్భశయనం శ్రీనివాసాచార్య, వనపట్ల సుబ్బయ్య, గుడిపల్లి నిరంజన్, శ్రీనిధి, షాజహాన, డా. పసునూరి రవీందర్, ఒద్దిరాజు ప్రవీణ్ కుమార్, డా. తిరునగరి శ్రీనివాస్, అరునాంక్ లతా, నరేష్కుమార్ సూఫీ, రజనీ కులకుర్ని, దొంతం చరణ్, రమేష్ కార్తీక్ నాయక్, డా. ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.
