హైదరాబాద్ ఏప్రిల్ 19 (ఈ తరంభారతం ); తెలంగాణ ఉద్యమకారులకి ఇచ్చిన హామిలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 21 సికింద్రబాద్ సీతాఫల్ మండి GHMC ఫంక్షన్ హాల్లో తెలంగాణ ఉద్యమకారులు ప్లీనరితెలంగాణ ఉద్యమకారులు ప్లీనరిని నిర్వహిస్తున్నట్లు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాస్ మరియు ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల సురేందర్ రెడ్డిలు టే తెలిపారు. శనివారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో మిడియా సమావేశంలో వారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారులకి ఇచ్చిన హామిలను అమలు చేయాలని, (250 గజాల ఇంటి స్థలం, పెన్షన్లు) ఒక కమిటీని ఏర్పాటు చేసి తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి గుర్తింపు కార్డులు జారీ చేయాలని, తెలంగాణ సాంస్కృతిక విభాగంలో కళాకారులకి 1000 ఉద్యోగాలు కల్పించాలని, తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, సంక్షేమ పథకాలలో 20 శాతం కేటాయించాలని, విద్యార్ధి ఉద్యమకారులకి ఉద్యోగాలలో 5 శాతం కేటాయించాలని, మార్వాడీల ఆధిపత్యాన్ని తగ్గించాలని, తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని, తెలంగాణ సినిమా, విద్యా పాలసీలను ప్రకటించాలని, (సీమాంద్ర ఆధిపత్యాన్ని తగ్గించడానికి) పై తెలిపిన అన్ని హామీలు జూన్ 2 తారీకు లోపు నెరవేర్చాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాస్ మరియు ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల సురేందర్ రెడ్డి అధ్యక్షతన ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం….నేటి కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు వీరస్వామి, గగన్ కుమార్, జ్యోతి రెడ్డి, జానకిరెడ్డి, మల్లూరు అనిల్, కొంతం యాదిరెడ్డి, ఇంద్ర కుమార్, జగన్ యాదవ్, పుట్నాల కృష్ణ, నరేంద్ర గౌడ్, రాంబాబు, ఆర్కే భూపాల్, కిరణ్ కుమార్, శ్యామల, శివ్ కుమార్ నేత, చంద్రశేఖర్, జగన్, మాణిక్యం, విజయ్ కుమార్, మహమ్మద్ గౌస్, మోహన్ చారి, శ్రీనివాస్ గౌడ్, భాస్కర్, సురేందర్, లక్ష్మణ్, సికిందర్, శ్రీనివాస్ మరియు శ్రీధర్ పాల్గొన్నారు