Eetaram Bharatam ఈతరం భారతమ్
Search
📗Eetaram Bharatam Journal Coming Soon.📕

భారత్ – పాక్’ యుద్ధం తప్పదా?

హైదరాబాద్ ఏప్రిల్ 25 (ఈతరం భారతం );ప్రస్తుతం భారతదేశం మరియు పాకిస్తాన్ దేశాల మధ్య అనూహ్య పరిణామాలు ఉద్రిక్తతలు తీవ్రమైన స్థాయికి చేరుకున్నాయి. 2025 ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్ వద్ద జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ దాడికి “ది రెసిస్టెన్స్ ఫ్రంట్” అనే ఉగ్రవాద సంస్థ బాధ్యత వహించింది, ఇది పాకిస్తాన్ ఆధారిత లష్కరే తోయిబా అనుబంధంగా భావించబడుతోంది.ఈ హఠాత్ పరిణామాలతో భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించి, వెంటనే పాక్ పై కఠిన చర్యలను తీసుకుంది. ఇరు దేశాల మధ్య వాణిజ్య మరియు దౌత్య సంబంధాల రద్దు చేసింది. పాకిస్తాన్ పౌరుల వీసాలను రద్దు చేసింది, ప్రధాన భూభాగ సరిహద్దును మూసివేసింది. సింధు జలాల ఒప్పందం నుండి ఉపసంహరణ ప్రకటించింది. పాకిస్తాన్ ప్రతిస్పందనగా భారతీయ విమానాలకు తన గగనతలాన్ని మూసివేసింది, వాణిజ్యాన్ని నిలిపివేసింది. సిమ్లా ఒప్పందాన్ని సస్పెండ్ చేసింది.

సైనిక ఉద్రిక్తతలు :

లైన్ ఆఫ్ కంట్రోల్ (LoC) వద్ద భారత మరియు పాకిస్తాన్ సైనికులు పరస్పరం కాల్పులు జరిపారు. ఇప్పటివరకు ప్రాణనష్టం నివేదికలు లేవు. ఐక్యరాజ్యసమితి, ఇతర అంతర్జాతీయ సంస్థలు ఇరు దేశాలను సంయమనం పాటించమని కోరుతున్నాయి. అమెరికా, రష్యా, యూరోపియన్ యూనియన్ వంటి దేశాలు ఈ పరిణామాలను గమనిస్తున్నాయి.

యుద్ధం తప్పదా..:

ప్రస్తుత పరిస్థితులు 2019లో జరిగిన పుల్వామా దాడి తర్వాత ఏర్పడిన ఉద్రిక్తతలను తలపిస్తున్నాయి. అయితే, ఇరు దేశాలు అణ్వాయుధ సామర్థ్యం కలిగి ఉండటంతో, ప్రత్యక్ష యుద్ధం తీవ్ర పరిణామాలను కలిగించవచ్చు. అంతర్జాతీయ సమాజం ఇలాంటి పరిణామాలను నివారించేందుకు కృషి చేస్తోంది.ప్రస్తుతం భారతదేశ అమాయక ప్రజలు పాక్ ప్రేరేపిత ఉగ్రదాడిలో చనిపోవడంతో యావత్ భారత సమాజం పాక్ పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది. మెజార్టీ భారత దేశ ప్రజలు పాక్ పై యుద్ధం చేయాలని, దానికి తగిన గుణపారాన్ని చెప్పాలని కోరుకుంటున్నారు. దీంతో భారతదేశం మరియు పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు అత్యంత తీవ్రమైన స్థాయికి చేరుకున్నాయి. అయితే, ప్రత్యక్ష యుద్ధం ప్రారంభమయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నాయి, ఎందుకంటే ఇరు దేశాలు అణ్వాయుధ సామర్థ్యం కలిగి ఉండటంతో, అంతర్జాతీయ సమాజం కూడా ఇలాంటి పరిణామాలను నివారించేందుకు కృషి చేస్తోంది. పరిస్థితిని శాంతియుతంగా పరిష్కరించేందుకు ఇరు దేశాలు సంయమనం పాటించడం అవసరమని భావిస్తున్నాయి. ఈ తరుణంలో భారత ప్రభుత్వం పాక్ ను అంతర్జాతీయ స్థాయిలో మరింత ఏకాకిని చేయాలి. దానికి సహకరించే దేశాలతో వాణిజ్య పరమైన సంబంధాలను తగ్గించుకోవాలి. దౌత్య యుద్ధాన్ని ముమ్మరం చేయాలి. పాక్ ఆర్థిక మూలాల్ని పెకిలించి వేయాలి. తక్కువ ప్రత్యక్ష యుద్ధంతో, ఎక్కువ పరోక్ష యుద్ధాన్ని కొనసాగించాలి. బలమైన ఆర్థిక స్వావలంబనతో ‘భారత్’ ను శత్రు దుర్భేద్యంగా తీర్చిదిద్దాలి. భారత్ తో పెట్టుకోవాలంటేనే శత్రువులకు వెన్నులో వణుకుపుట్టేలా ‘భారతీయుల ఆత్మ గౌరవ పతాక’ ను ప్రపంచ యవనికపై ఎగురవేయాలి. జై భారత్!.

ll భారత సుదర్శన్, సామాజిక రాజకీయ విశ్లేషకులుll

Related News

Select the Topic
Scroll to Top