EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
📗Eetaram Bharatam Journal Coming Soon.📕

స్కూల్ టీచర్స్ పి.జి.టి., టి.జి.టి., హెచ్.ఎస్., పి.ఇ.టి. లైబ్రేరియన్లకు మైనారిటీ గురుకులంతో సమానంగా జీతాలు చెల్లించాలి

హైదరాబాద్ మే 12 (ఈతరం భారతం);జె. ఎల్స్ మ్యానిఫెస్టోలో పెట్టిన ప్రకారం నెలకు రూ.42 వేల జీతం చెల్లించాలని, మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవులు మంజూరి చెయ్యాలని తెలంగాణ రాష్ట్ర సాంఘీక సంక్షేమ గురుకుల పార్ట్ టైం ఉద్యోగుల సంఘం రాస్ట్రా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం బిసి భవన్ లో బిసి సంక్షేమ సంఘం జాతీయ అద్యక్షులు , రాజ్య సభ సబ్యులు ఆర్. కృష్ణయ్య ను కలిసి వినతి పత్ర సమర్పించారు.తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల ఎస్సీ గురుకులు నందు పనిచేస్తున్న బోధనసిబ్బంది పురుషులు మరియు మహిళలు అందరూ కలిసి 4000 మంది పనిచేస్తున్నాము. అందులో పురుషులు దరిదాపుగా 2000 మంది బోధన సిబ్బంది పని చేస్తున్నాము. డి. ఎల్, జే. ఎల్, పి.జి.టి., టి. జి. టి., లైబ్రేరియన్, స్టాఫ్ నర్స్ లము అందరం కలిసి పేద విద్యార్థుల భవిష్యత్తు కోసం నిరంతరం కష్టపడి వారి యొక్క భవిష్యత్తును గురించి నిరంతరం విద్యా బోధన చేస్తున్నాము. అదేవిధంగా రెగ్యులర్ ఉపాధ్యాయుల సిబ్బందితో పాటు సమానంగా అన్ని విధుల నిర్వర్తిస్తున్నాము అనగా నైట్ స్టడీ అవర్స్, హాలిడే డ్యూటీ, నైట్ స్టే, హౌస్ మాస్టర్ గా విధుల నిర్వర్తిస్తున్నాము. క్లాస్ టీచర్ ఎగ్జామ్స్, సక్సేడ్ ఎగ్జామ్స్, యూనిట్ టెస్ట్లు, గ్రాండ్ టెస్ట్లు, ఫ్రీ ఫైనల్ ఎగ్జామ్స్ ఈ రకంగా విదులు నిర్వర్తిస్తున్నాము. విద్యార్థులు యొక్క రిజల్ట్స్ 100% తీసుకు వస్తున్నాము. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తును తీర్చిదిద్దుతున్నాము. కానీ మిగతా గురుకులంతో పోలిస్తే మాకు ఇచ్చే జీతాలు కూడా అతి తక్కువగా ఉన్నాయి. ఈ విధంగా ఇచ్చే జీతాలు పోయిన సంవత్సరం నుండి నెల నెలలకు బదులుగా నాలుగు నెలలు, మూడు నెలలకు ఒక్కోసారి ఇస్తున్నారు. ఈ విధంగా ఇవ్వడం వలన మా యొక్క కుటుంబాలను పోషించుకోవడం చాలా భారంగా మారింది. ఇంటి కిరాయి, పిల్లల స్కూల్ ఫీజులు ఆసుపత్రి ఖర్చులు భారంగా ఉన్నాయి. కావున మాకు జీతాలు మైనార్టీ గురుకులాలతో పాటు సమానంగా ఇవ్వాలని పోయిన ప్రభుత్వం కు మేము ఎన్నోసార్లు వినతి పత్రం ఇచ్చాము, కానీ మమ్మల్ని పట్టించుకోలేదు. కాబట్టి ఎలక్షన్స్కు ముందు మేము అందరము కలిసి గాంధీభవన్కి వెళ్లి ప్రస్తుత ఐటీ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారికి మా యొక్క వినతి పత్రం సమర్పించినాము. మరియు గౌరవ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు మాకు ఆరోజు గాంధీభవన్లో మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మీకు న్యాయం చేస్తాము, మినిమం టైమ్స్ స్కేల్ ఇస్తాము, 12 నెలల జీతం ఇస్తాము మరియు అదేవిధంగా జాబ్ సెక్యూరిటీ ఇస్తాము, జే ఎల్ సి కి 42 వేల జీతం చెల్లిస్తామని వారు మాట ఇచ్చి ఎన్నికల మేనిఫెస్టోలో పెడతామని మాట ఇచ్చారు. కానీ కరెక్ట్ గా పోయిన సంవత్సరం మే నెలలో మాకు కొత్త సెక్రటరీ అలుగు వర్షిని గారు రావడము జరిగినది. ప్రస్తుతం కూడా ఈమనే మాకు సెక్రటరీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కానీ ఈ సంవత్సరము 27 మార్చి 2025 నాడు జీవో నెంబర్ 1274 తీసుకువచ్చి గర్ల్స్ స్కూల్ నందు పురుష బోధన సిబ్బంది ఉండరాదు అని సర్కులర్ పెట్టి మమ్మల్ని రాష్ట్రవ్యాప్తంగా తొలగించినది. కావున మా యొక్క కుటుంబాలు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డాయి మరియు అదేవిధంగా ఎం.జె.పి. బీసీ గురుకుల, టి.టి. డబ్ల్యూ. ఆర్. ఈ.ఐ.ఎస్ గిరిజన గురుకుల నందు పురుషుల బోధన సిబ్బంది యధావిధిగా కొనసాగిస్తున్నారు. కానీ కేవలం ఈ ఎస్సీ గురుకులంలో మాత్రమే పనిచేస్తున్నటువంటి పురుష సిబ్బందిని మాత్రమే సెక్రటరీ అలుగు వర్షిని కావాలని ఆమె తొలగించడం జరిగింది. కాబట్టి మేము గత పది పన్నెండు సంవత్సరాలుగా రాత్రి పగలు పిల్లల భవిష్యత్తు కోసం మేము పనిచేయుచున్నాము. కావున మా యందు దయ ఉంచి మా ఉద్యోగాలు మాకిప్పించి మా కుటుంబాలను ఆదుకోగలరని మనవి. అదేవిధంగా ఎస్ సీ గురుకులాల నందు హిందీ పండిత్ టీచర్ ఒక్కరే హిందీ బోధిస్తున్నారు. కావున ఆరో తరగతి నుండి పదవ తరగతి వరకు ఏ మరియు బి సెక్షన్స్ బోధించడం ఒక్కరివల్ల సాధ్యపడడం లేదు. కాబట్టి మరి విద్యార్థులకు కూడా ఆ హిందీ సబ్జెక్టు టీచర్ ఒక్కరు ఉండడం వల్ల న్యాయంజరగడం లేదు. కావున హింది సబ్జెక్టు కూడా ఇద్దరూ హిందీ పండితులు ఉండాలని విజ్ఞప్తి చేశారు.ఇంతకుముందు కూడా హిందీ పండితులు ఇద్దరు ఉన్నారు. కానీ ఈ సంవత్సరము ఒకరిని తీసివేసి ఒకే ఒక హిందీ పండితును తీసుకున్నారు. అదేవిధంగా మైనారిటీ గురుకుల ఉద్యోగులతో సమానంగా మాకు జీతాలు ఇప్పించగలరని కోరుతున్నాము. మైనారిటీ గురుకులాలతో పోల్చుకుంటే ఎస్సీ గురుకులాల నందు ఇస్తున్న జీతాలు చాలా తక్కువగా ఉన్నాయి. కేవలం 10 నెలలు మాత్రమే జీతాలు చెల్లిస్తున్నారు. ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మొదటి రోజే మమ్మల్ని ఇంటికి పంపిస్తున్నారు. ప్రిన్సిపల్స్ మరియు జోనల్ ఆఫీసర్స్ వాళ్ళు నిర్దాక్షిణ్యంగా విధుల నుండి ఇంటికి పంపడం జరుగుతుంది. అదేవిధంగా మాకు కూడా నెలలో రెండు లీవులు తీసుకునే విధంగా అవకాశం కల్పించగలరు మరియు మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవులు కూడా ఇవ్వవలసిందిగా కోరుచున్నాము.ఈ పై విదంగా మాకు చెల్లిస్తున్నటువంటి వివిధ రకాల గురుకుల సొసైటీల జితాలు, సాంఘీక సంక్షేమ గురుకులంలో పనిచేస్తున్నటువంటి బోధన సిబ్బందికి మాత్రమే అతి తక్కువ జీతాలు చెల్లిస్తున్నారని పేర్కొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top