హైదరాబాద్ మే 4.(ఈతరం భారతం)డ్యాన్స్ ఇండియా తెలంగాణ రాష్ట్ర అవార్డుల ప్రదానోత్సవం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగు వర్సీటీ వీసీ, ప్రొఫెసర్ నిత్యానంద రావు, ప్రత్యేక అతిథిగా తెలంగాణ రాష్ట్ర పర్యాటక జనరల్ మేనేజర్ సురేష్ రెడ్డి లు పాల్గొని నృత్యం, సంగీత ప్రపంచానికి విశేష కృషి చేసిన ప్రతిభావంతులు, పండితులు, విద్యావేత్తలకు డాన్స్ అవార్డ్స్ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా వీసీ నిత్యానంద రావుమాట్లాడుతూ నృత్య ప్రదర్శనను ప్రోత్సహించడంలో తెలుగు వర్సీటీ ముందుంటుందని, నృత్య ప్రదర్శనలకు హల్ ఉచితంగా ఇవ్వనున్నట్లు తెలిపారు. కాగా మెమొంటోలను డాన్స్ మ్యాగ్జిన్ ఉచితంగా అందజేయున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుత సాంస్కృతిక రంగంలో డాక్యుమెంటేషన్ ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. భారతదేశ గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడటంలో దాని ప్రాముఖ్యతను ఆయన వివరించారు. తెలంగాణ రాష్ట్ర పర్యాటక జనరల్ మేనేజర్ సురేష్ రెడ్డి మాట్లాడుతూ పర్యాటకశాఖ తరఫున వీలైనంత సహాయ సహకారాలు అందిస్తామని వెల్లడించారు.అవార్డ్ గ్రహీతల వివరాలు: ది డ్యాన్స్ ఇండియా సిల్వర్ ఘుంగ్రూ అవార్డు డి. వి. సత్యనారాయణ (కూచిపూడి ఎక్స్పోనెంట్), టార్చ్ బేరర్ అవార్డు ఏలేశ్వరపు చలపతి శాస్త్రి (కూచిపూడి ఘట్టం), భాస్కర హరి ప్రియ (కర్ణాటిక్ సంగీత విద్వాంసురాలు) బీకాన్స్ ఆఫ్ లైట్ అవార్డు: డా. సుమిత్ర పార్థసారథి (నాట్య చరిత్రకారిణి, విద్వాంసురాలు, విద్యావేత్త) డాక్టర్ ఇందిరా హేమ (భరతనాట్య విద్వాంసురాలు), బెస్ట్ స్కాలర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు: మంజుల పోచంపల్లి (తెలుగు విశ్వవిద్యాలయం) రేస్ ఆఫ్ హోప్ అవార్డు: మహేశ్వరి మంత, శుభా రాజేశ్వరి, ప్రియా నవీన్, స్నేహ గాడిచెర్ల, ది మాస్ట్రో ఆఫ్ హోస్టింగ్ అవార్డు: అంబడిపూడి మురళీకృష్ణ, ది డ్యాన్స్ ఇండియా ఎక్సలెన్స్ అవార్డు: డి. వత్సలేంద్ర, ఉత్తమ డ్యాన్స్ టీచర్ అవార్డు: వాణీ రమణ, అర్చన మిశ్రా వసంత సంధ్య పెండ్యాల, కిండిల్ స్పిరిట్ అవార్డు: యవనిక, యాగ్నిక లు అందుకున్నారు. కార్యక్రమంలో ది డ్యాన్స్ ఇండియా మ్యాగజైన్ ఎడిటర్-ఇన్-చీఫ్ విక్రం కుమార్, అసిస్టెంట్ ఎడిటర్ ఎం. భారతి, సెలక్షన్ కమిటీ చైర్పర్సన్ డాక్టర్ సజని వల్లభనేని, తదితరులు పాల్గొన్నారు.
