హైదరాబాద్ జనవరి 28 (ఈతరం భారతం);76వ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని తెలంగాణ స్వాభిమాన పరిషత్ అధ్యక్షులు వినయ్ కిషోర్ యాదవ్ ఆధ్వర్యంలో సైదాబాద్ ఎక్స్ రూట్ లో కులం మతం లేని ఒకే ఒక భావంతో రక్తదానం మహాదానం నిర్వహించారు అదేవిధంగా రాష్ట్రీయప్తంగా యువకులకి డ్రగ్స్, ఆల్కహాల్, సిగరెట్ మరియు ఆన్లైన్ బెట్టింగ్ అలవాటం తో యువకుల మన భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నారు ఇటువంటి చెడు అలవాటులు తో బానిసలు కావద్దని ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా చెడు అలవాటు మార్చుకొని దేశభక్తి మరియు మాతృభక్తి తో మన భవిష్యత్తు ప్రకాశం చేసుకోవాలి అని ముక్తకంఠంగా అన్ని రాజకీయ నాయకులు కోరుకున్నారు . ఈ కార్యక్రమం లో వినయ్ కిషోర్ యాదవ్ తెలంగాణ స్వాభిమాన్ పరిషత్ అధ్యక్షులు మరియు బిజెపి సుభాష్ చంద్ర జి ఎక్స్ డిప్యూటీ మేయర్ మరియు సహదేవ్ యాదవ్ ఎక్స్ కార్పొరేటర్, నాగు నాగేష్ టిడిపి హైదరాబాద్ పార్లమెంట్ ఇంచార్జ్, కేడి దినేష్ టిడిపి స్టేట్ నాయకుడు బి వై శ్రీకాంత్, జోగేంద్ర సింగ్, హైమద్ షరీఫ్, డి గోపాల్ రావు, ప్రేమ్ ప్రకాష్ శర్మ, తదితరులు పాల్గొన్నారు.