హైదరాబాద్ ఏప్రిల్ 25 (ఈతరం భారతం);టి ఆర్ ఎస్ పార్టీ 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్బంగాబిఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులుగా బీసీకి అవకాశం కల్పిస్తూ ఈనెల 27 న జరిగే వరంగల్ సభలో ప్రకటించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. శుక్రవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ వేదికగా ఆ పార్టీ అధ్యక్షులు కెసిఆర్ కు బహిరంగ లేఖ విడుదల చేసారు. ఈ కార్యక్రమంలో బీసీ కుల సంఘాల జేఏసీ కన్వీనర్ బాలగోని బాలరాజు గౌడ్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వహక అధ్యక్షులు కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, బీసీ యువజన సంఘం జాతీయ అధ్యక్షులు కనకాల శ్యామ్ కుర్మా, గౌడ జన హక్కుల పోరాట కమిటీ అధ్యక్షులు ఎలికట్టే విజయ్ కుమార్ గౌడ్, కల్లుగీత సంఘాల కన్వీనర్ ఆయిలీ వెంకన్న గౌడ్, బీసీ సమాఖ్య అధ్యక్షులు దుర్గయ్య, నాగేష్ , బుర్ర సోమేశ్వర్, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు…
