Eetaram Bharatam ఈతరం భారతమ్
Search
📗Eetaram Bharatam Journal Coming Soon.📕

ముమ్మరంగా స్పోర్ట్స్ అథారిటీ సమ్మర్ కోచింగ్ క్యాంప్స్

హైదరాబాద్ ఏప్రిల్ 28 (ఈ తరం భారతం); తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో జంట నగరాల్లోని అన్ని స్టేడియాల్లో మరియు 33 జిల్లాలలో మే 1వ తేదీ నుండి జూన్ 6 వరకు వేసవి క్రీడా శిక్షణా శిబిరాలు నిర్వహిస్తున్నట్లు స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ కే శివసేన రెడ్డి తెలిపారు. వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు 2025 పోస్టర్ రిలీజ్ మరియు క్రీడా సామాగ్రి పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ క్రీడల సలహాదారులు ఏపీ జితేందర్ రెడ్డి , వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి సోనీ బాలాదేవితో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొన్న స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనరెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనల మేరకు యువకులు క్రీడాకారులు విద్యార్థులు ఈ వేసవి క్రీడా శిక్షణ శిబిరాల్లో అధిక సంఖ్యలో పాల్గొనే విధంగా స్పోర్ట్స్ అథారిటీ ఏర్పాట్లు చేస్తోందని అన్నారు. విద్యార్థులకు క్రీడల పట్ల ఆసక్తి కలిగించే విధంగా విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కూడా క్రీడా మైదానాల వైపు ఆకర్షితులయ్యే విధంగా ఈ వేసవి శిబిరాలు ఉన్న నిర్వహిస్తున్నామని తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులకు ఉచితంగా యోగ మరియు జుంబా డాన్స్ లలో శిక్షణ ఇవ్వబోతున్నట్లు వివరించారు. గతంలో కంటే ఎక్కువ క్రీడాంశాలలో శిక్షణ ఇస్తున్నామని ఆయన తెలిపారు అంతేకాకుండా కాకుండా గతంలో కేవలం జిల్లా కేంద్రాలకు పరిమితం అయినా ఈ వేసవి శిక్షణ శిబిరాలను ఈసారి పలు పట్టణ కేంద్రాల్లో కూడా నిర్వహించబోతున్నట్లు ఆయన తెలిపారు.ఈ వేసవి శిబిరాల్లో వివిధ క్రీడాంశాల్లో అసిస్టెంట్ కోచులుగా సేవలందించే వారికి గౌరవ వేతనం పెంచబోతున్నట్లు ఆయన తెలిపారు. ఈ వేసవి క్రీడా శిక్షణ శిబిరాలలో పాల్గొనబోతున్న క్రీడాకారులు విద్యార్థులను ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ద్వారా నమోదు చేసుకోవాలని వారి సమాచారాన్ని భవిష్యత్తులో క్రీడా అవసరాలకు వినియోగించేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ క్రీడల సలహాదారులు ఏపీ జితేందర్ రెడ్డి మాట్లాడుతూ, వివిధ ప్రవేటు సంస్థలు అందించే వేసవి శిక్షణ శిబిరాలు పేద మధ్యతరగతి విద్యార్థులకు క్రీడాకారులకు అందుబాటులో లేకుండా ఉన్నాయని స్పోర్ట్స్ అథారిటీ అందించబోయే వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు అందరికీ అందుబాటులోకి తెచ్చే విధంగా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనల మేరకు గ్రామీణ క్రీడాకారులకు ప్రోత్సాహం ఇచ్చే విధంగా ఈ వేసవి క్రీడా శిక్షణ శిబిరాలను ముమ్మరంగా ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. ఈ శిబిరాల్లో పాల్గొంటున్న క్రీడాకారుల సమాచారాన్ని నిక్షిప్తం చేస్తున్నామని ఆయన తెలిపారు.అసిస్టెంట్ కోచులుగా సేవలందించే వారి వివరాలను కూడా ఆన్ లైన్లో పొందుపరుస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎండి సోనీ బాలాదేవి డిప్యూటీ డైరెక్టర్లు చంద్రారెడ్డి, రవీందర్, సుజాత తదితరులు పాల్గొన్నారు.

 

 

Related News

Select the Topic
Scroll to Top