హైదరాబాద్ నవంబర్ 24 (ఈ తరం భారతం ); తెలంగాణ కవుల సంఘం, కళా సూర్య కల్చరల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర భాష సాంస్కృతిక శాఖ సౌజన్యంతో ప్రముఖ కవి డాక్టర్ జన్వాడ రామస్వామి రచించిన సుందరేశ్వర శతకం, పద్య కవిత ‘మురమురాలు’ ఆధునికాంధ్ర సాహిత్యంలో సంస్కరణ కవిత్వం (సిద్ధాంత గ్రంథం) జనవాడ ఫౌండేషన్ పోస్టర్ ఆవిష్కరణ మహోత్సవం ఈనెల 27న బుధవారం సాయంత్రం 6 గంటలకు రవీంద్ర భారతి కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహిస్తున్నట్లు తెలంగాణ కవుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు సుతారం వెంకటనారాయణ, కళా సూర్య కల్చరల్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు అనుముల ప్రభాకరాచారి నేడొక ప్రకటనలో తెలిపారు. ఈ మహోత్సవానికి విశిష్ట అతిథులుగా తెలంగాణ రాష్ట్ర భాష సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి, , కవి పండితులు సుధామ. కవి విమర్శకులు విహారి హాజరవుతున్నట్లు తెలిపారు. ముఖ్య అతిథులుగా వెల్దండ సత్యనారాయణ అలాగే నాళేశ్వరం శంకరం హజరవుతున్నట్లు తెలిపారు.ప్రత్యేక అతిథులుగా సి ఆర్ భగవంతరావు ఆత్మీయ అతిథులుగా తెలంగాణ సంఘం రాష్ట్ర అధ్యక్షులు సుతారం వెంకటనారాయణ, అలాగే శ్రీ ఆకాంక్ష ట్రస్ట్ ఫౌండర్ పాలపర్తి సంధ్యారాణి, హాజరవుతున్నట్లు వారు తెలిపారు.