భూపాలపల్లి ఏప్రిల్ 28 (ఈ తరం భారతం);భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఆదివారము నిర్వహించిన ఉద్యోగమేళాలో మధుగురు అక్షర యజ్ఞం ప్రచార సంచికను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆవిష్కరించారు.ఈ సందర్భంగా అక్షర యజ్ఞం నిర్వహకులు రౌతు.మధూకర్ పిల్లలకు ఉన్న చదువులు -పెద్దలకు ఉపాధి మార్గాలు అందించాలనీ జూకల్ గ్రామ కేంద్రంగా ఈ విద్యా వికాస కార్యక్రమాన్ని నిర్వహించబడు తున్నదని తెలిపారు.అక్షర యజ్ఞంలో భాగంగా మధుగురు ఇన్నోవేషన్ కేంద్రాలలో యువత, మహిళలకు ఉద్యోగానికి కావాల్సిన ప్రావీన్యాలని, నైపుణ్యాలని పెంపొందించడం,వ్యాపారానికి కావాల్సిన వనరులను అందించబడునని పూర్తి వివరాలకు 9441226834 ,9491504405 లో సంప్రదించ గలరని తెలిపారు.ఈ కార్యక్రమంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ,జిల్లా ఎస్ .పి కిరణకరే ,జూకల్ గ్రామ కాంగ్రెస్ నాయకులు పోలోజు సంతోష్,ఎలమాద్రి భద్రయ్య తదితరులు పాల్గొన్నారు.
