నాగర్కర్నూల్ ఏప్రిల్ 19 (ఈతరం భారతం); : మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఎంపి మల్లు రవిలకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. నాగర్కర్నూల్ జిల్లాలో మంత్రులు, ఎంపి భూభారతి సదస్సులో పాల్గొనేందుకు వచ్చారు. ఆ సమయంలో వారు ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ ల్యాండింగ్ అవుతున్న సమయంలో హెలిప్యాడ్ సమీపంలో అగ్ని ప్రమాదం జరిగింది. వెంటనే అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు మంటలను అదుపు చేశారు. దీంతో ప్రమాదం తప్పింది. హెలికాఫ్టర్ ల్యాండ్ కోసం ఇచ్చిన సిగ్నల్ బుల్లెట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది
.