నిజామాబాద్ ఫిబ్రవరి 20 (ఈతరం భారతం); : జిల్లాలోని బోధన్ మండలం పెగడపల్లి గ్రామ శివారులో కరెంట్ షాక్‌తో ముగ్గురు మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది. పందుల వేటకు వెళ్లగా ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి మృతి చెంది ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతులు రెంజల్ మండలం సాటాపూర్ గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన ఓర్సు గంగారం, బాలమణి, కిషన్ గా గుర్తించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
