ఈతరం భారతం సిద్దిపేట మే 4 :సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ ఆర్యవైశ్య సీనియర్ నాయకులు చందా లక్ష్మయ్య, లక్ష్మి నర్సమ్మ వివాహ వార్షికోత్సవ వేడుకలు వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఆదివారం గజ్వేల్ లో వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న యాదాద్రి భువనగిరి జిల్లా కాచారం శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయం వ్యవస్థాపక అధ్యక్షుడు వాసవి ఉపాసకులు ఆధ్యాత్మిక వేత్త డాక్టర్ వంగపల్లి అంజయ్య స్వామి మాట్లాడుతూ చందా లక్ష్మయ్య లక్ష్మి నర్సమ్మ దంపతులకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపి,వారి కుటుంబానికి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి అనుగ్రం,నిండు దీవెనలు ఉంటాయని,అత్యంత వైభవంగా వివాహ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించిన చందా లక్ష్మయ్య లక్ష్మి నర్సమ్మ కుటుంబ సభ్యులను అభినందించారు,ఈ కార్యక్రమంలో, చందా శ్రీనివాస్, నాగరాజు,చందా లక్ష్మయ్య లక్ష్మి నర్సమ్మ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు
