ఈతరం భారతం యాదాద్రి భువనగిరి ప్రతినిధి మే 9 :యాదగిరి-భువనగిరి జిల్లా భువనగిరి మండలం వీరవెల్లి గ్రామంలో ఆత్మహుతి వీరగల్లును కొత్త తెలంగాణ చరిత్రబృందం సభ్యుడు కుండే గణేష్ గుర్తించాడు.ఆత్మార్పణశిలలో నడినెత్తిన కొప్పుతో కుడిచేత పెద్దకత్తి, ఎడమచేత లింగమో, ఫలమో పట్టుకుని నిల్చున్న వీరుడు ఆత్మాహుతికి సిద్ధమైనాడు. పై అంతస్తులో అతడు వీరస్వర్గమలంకరించినట్లున్నది. కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీ రామోజు హరగోపాల్ శిల్పశైలిని బట్టి ఈ వీరశిల రాష్ట్రకూట(8,9) కాలానికి చెందిందని తెలిపారు. తీవ్రమైన భక్త్యావేశంతో శివార్పణంగా ఆత్మాహుతి చేసుకునే గడతల, శూలారోహణ, గళనిగళన, ఉదరచ్ఛేదన, సర్పదంష్ట్ర వంటి పద్ధతులు పాటించిన వీరుల శిలలను అనేకం గుర్తించినట్లు వివరించారు.
