ఈతరం భారతమ్ డాట్ కామ్ వెబ్సైట్ ఒక న్యూస్ పోర్టల్. ఇది స్వతంత్రమైన, నిష్పాక్షిక వార్తలు, అభిప్రాయాలు అందించడానికి ఏర్పాటైన వేదిక. బహు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న పాఠకులు, శ్రోతలు, ప్రేక్షకుల కోసం రూపొందించిన న్యూస్ పోర్టల్. 2023లో ఈ న్యూస్ పోర్టల్ ను ఈతరం క్రియేషన్ అండ్ పబ్లికేషన్స్ సంస్థ ప్రారంభించింది. 24 గంటలు అన్ని రోజులు వార్తా సమాచారాన్ని అందించే ఈ వెబ్సైట్ కి అనుబంధంగా ఈతరంభారతమ్ ఛానల్ పనిచేస్తుంది. ఈతరం క్రియేషన్ అండ్ పబ్లికేషన్స్ బహుభాషల్లో పుస్తకాల ప్రచురణ, పత్రికల నిర్వహణ, డాక్యుమెంటరీలు, షార్ట్ ఫిలిమ్స్, ఫీచర్ సినిమాలు, ఆడియో వీడియో ఆల్బమ్స్, మనోరంజకమైన కార్యక్రమాలు, సాహిత్య, విజ్ఞాన సమావేశాలు, పుస్తక ఆవిష్కరణలు లాంటి వాటిలో భాగం పంచుకుంటుంది. ఖచ్చితమైన సమాచారాన్ని, నాణ్యమైన, గుణాత్మక విషయాలను వివాదాలకు తావు లేకుండా ముద్రణ, శ్రవణ, దృశ్య మాధ్యమంలో అందించడం ప్రధాన లక్ష్యంగా పనిచేస్తుంది. ఆయా రంగాల్లో నిష్ణాతులైన నిపుణుల సలహా, మార్గదర్శకత్వంలో ఈ సంస్థ నడుస్తుంది.