ఈతరం భారతం హైదరాబాద్ మార్చ్ 20 :
మణిరత్నం తన 19వ సినిమా కోసం మళ్ళీ ఏఆర్ రెహమాన్‌తో చేతులు కలిపారు. గత కొద్దిరోజులుగా ఈ సినిమాకు యువ సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తారని ప్రచారం జరిగినప్పటికీ, వాటన్నింటికీ చెక్ పెడుతూ మద్రాస్ టాకీస్ సంస్థ రెహమాన్ పేరును ఖరారు చేసింది. దీంతో ఈ లెజెండరీ కాంబో మళ్ళీ వెండితెరపై మ్యాజిక్ చేయడానికి సిద్ధమైంది.1992లో ‘రోజా’ సినిమాతో మొదలైన వీరిద్దరి అద్భుత ప్రయాణం, ఇప్పుడు 19వ సారి ఈ కొత్త సినిమాతో కొనసాగబోతోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి హీరోగా నటించబోతుండగా.. ‘నేచురల్ స్టార్’ సాయి పల్లవి మణిరత్నం సినిమాలో హీరోయిన్గా నటించబోతుంది.



