EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

హ్యూమనాయిడ్ టీచర్లు వస్తున్నారు…

ఈతరం భారతం శాస్త్ర సాంకేతిక అంశం:

కృత్రిమ మేధ.. ప్రస్తుతం అన్ని రంగాల్లోకి ప్రవేశించిం ది. ప్రతీ ఒక్క అంశం గురించిన విషయాన్ని మనకు అర్థమ య్యేలా చెప్తూ.. దానికి సంబంధించిన పరిజ్ఞానాన్ని అందించ డంలో కృత్రిమ మేధ పైచేయి సాధించింది. మానవుల మాదిరిగా ఆలోచించి.. నేర్చుకుని.. నిర్ణయాలు తీసుకునే సామర్ధ్యాన్ని కలిగిన కంప్యూటర్ బేస్డ్ సాంకేతికత. విద్యారంగంలో చాలా వేగంగా విప్లవాత్మక మార్పులు తీసుకొస్తోంది. ఏఐ వల్లబోధిం చడం సులువవడమేకాకుండా టీచింగ్లో అవకాశాలు పెరుగు తాయి. అయితే, సరైన రీతిలో వినియోగం, డేటా గోప్యత, విలు వలు చాలా ముఖ్యం. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఏఐ ఆధారిత విద్యాబోధనకు రంగం సిద్ధమవుతోంది. మనుషుల ఆకారం లో ఉండే రోబోలు విద్యార్థులకు పాఠాలు చెప్పడం, ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం, ఇంటరాక్టివ్ క్లాస్ నడపడం వంటి పనులను చాలా సులువుగా చేసేలా సిద్ధమవుతున్నాయి. మూడు భాషల్లో విషయ పరిజ్ఞానం బోధించేలా హ్యూమ నాయిడ్ టీచర్లు అందుబాటులోకి వస్తున్నారు.

మన దేశంలోని రోబో టీచర్లు

రోబోట్: భారతదేశంలోనే అత్యంత ప్రసిద్ధ హ్యూమనాయిడ్ ఎడ్యుకేషనల్ రోబోట్. ముంబైకి చెందిన ఉపాధ్యా యుడు దినేష్ పటేల్ చేతిలో తయారైంది. వ్యర్థ పదార్థాలతో తయారు చేయడం దీని ప్రత్యేకత. తెలుగు సహా 9 భారతీయ భాషలు, 38 విదేశీ భాషలు మాట్లాడుతుంది. పాఠాలు చెప్తుంది. విద్యార్థుల ప్రశ్నలకు సమాధానమిస్తుంది.

ఐరిస్ రోబోట్: కేరళలో కేటీసీటీ హైస్కూల్లో పరిచయంచేసిన మొదటి ఏఐ టీచర్ రోబో. చీర కట్టుకుని ఉంటుంది. విద్యార్థులతో ఇంటరాక్ట్ అవుతుంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రా ల్లో ఇలాంటి ప్రయోగాలు విస్తరిస్తున్నాయి.

టీచర్ రోబోట్: హైదరాబాద్ లోని కొన్ని స్కూళ్లలో ఏఐ రోబోట్ టీచర్లు పరిచయం అయ్యాయి. పిల్లలు వీటితో మాట్లాడుతూ పాఠాలు నేర్చుకుంటున్నారు.

వీటితో పాటు బెంగళూరులో ఈగల్ 2.0 రోబోట్ సైన్స్ సబ్జెక్టులు బోధిస్తుంది. ఉత్తరప్రదేశ్లో 17 ఏళ్ల విద్యార్థి అభి వృద్ధి చేసిన సోఫీ రోబోట్ క్లాస్లో టీచర్గా పనిచేస్తోంది.

విద్యాబోధనలో ఐరిస్

ప్రతి విద్యార్థి అవసరాలు, ప్రాధాన్యతలకు అనుగుణంగాప్రవేశపెట్టడం వెనుక ఉన్న ప్రధా న లక్ష్యం. ఈ వ్యక్తిగతీకరణ, అధ్యాపకులు మరింత ఆసక్తికర మైన, ప్రభావవంతమైన పాఠాల ను అందించేలా శక్తినివ్వడం లక్ష్యంగా పెట్టుకుంది. తద్వారా విద్యా రంగంలో సాంకేతికతను ఏకీకృతం చేయడంలో ఇది ముఖ్య మైన ముందడుగును సూచి స్తుంది.

ఐరిస్ ముఖ్య లక్షణాలు

1. బహుభాషా సామర్థ్యాలు: ఐరిస్

మూడు భాషలు మాట్లాడగలదు. ఫలితంగా విభిన్న విద్యార్థుల సమూహానికి అందుబాటులో ఉంటుంది.

2. క్లిష్టమైన ప్రశ్నలకు సమా ధానమివ్వడం: కష్టమైన ప్రశ్నల కు సమాధానమివ్వడానికి ఐరిస్ ప్రోగ్రామ్ చేయబడి ఉంటుంది. ఇది ఇంటరాక్టివ్ లెర్నింగ్ టూల్గాపని చేస్తుంది

3. వాయిస్ అసిస్టెంట్: ఈ హ్యూమనాయిడ్ ఒక వాయిస్అసిస్టెంట్ గా పనిచేస్తుంది. ఇది విద్యార్థులకు, అది అందించే విద్యా విషయాలకు మధ్య సంభాషణను సులభతరం చేస్తుంది.

4. ఇంటరాక్టివ్ లెర్నింగ్: సాంప్రదాయ బోధనా పద్ధతులుసాధించలేని విధంగా విద్యార్థులను నిమగ్నం చేస్తూ ఇంటరా క్టివ్ లెర్నింగ్ అనుభవాన్ని అందించడానికి ఐరిస్ రూపొం దించబడింది.

5. మానిప్యులేషన్ సామర్థ్యాలు: ఈ రోబోకు మానిప్యులేషన్

సామర్థ్యాలు ఉంటాయి. విద్యా విషయాలను అందించడంతో పాటు భౌతిక పనులను కూడా చేయగలదని సూచిస్తుంది.

6. చలనశీలత: ఐరిస్ కదిలిలా తయారు చేస్తారు. దాంతో అభ్యాస వాతావరణంలో తిరగడానికి, వివిధ సందర్భాలలో విద్యార్థులతో సంభాషించడానికి వీలు కల్పిస్తుంది.

తెలుగు రాష్ట్రాల్లో ఇంకా పెద్ద ఎత్తున హ్యూమనాయిడ్ టీ చర్లు స్కూళ్లలో అందుబాటులోకి రాకపోయినా, ఏఐ ఆధారిత రోబోలు, చాట్బాట్లు, వర్చువల్ ట్యూటర్లను విరివిగా వాడు తున్నారు. భవిష్యత్లో తెలుగులో పూర్తిగా మాట్లాడే హ్యూమ నాయిడ్ టీచర్లు రావడం ఖాయం.

 

*🔵రోబో బోధనతో ప్రయోజనాలు*

 

*➡️24/7 అందుబాటులో ఉండటంతో పాటు అలసిపోకుండా ఉంటుంది*.

 

*➡️ప్రతి విద్యార్థికి తగినట్లుగా వివరణలు ఇస్తుంది.*

 

*ఇంగ్లిష్, హిందీ, మాతృభాషలో మాట్లాడగలుగుతుంది.*

 

*➡️మనుషుల మాదిరిగానే చేతులు, తల కదిలిస్తూ.. విద్యార్థుల హావభావలకు తగినట్టుగా ప్రవర్తిస్తూ ప్రశ్నలడుగుతూ బోధిస్తుంది.*

 

*➡️ఉపాధ్యాయులపై భారం తగ్గుతుంది. టీచర్లు ఇతరత్రా అంశాలపై దృష్టి పెట్టేందుకు సమయం దొరుకుతుంది.*

Related News

Select the Topic
Scroll to Top