మెదక్ ఫిబ్రవరి 22 (ఈతరంభారతం); ఉమ్మడి మెదక్ జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి గెలుపు ఖాయమనీ న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ అన్నారు.శనివారం ఉమ్మడి మెదక్ జిల్లా, ఉమ్మడి మెదక్ జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి మెదక్, నిజాంబాద్, అదిలాబాద్, కరీంనగర్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి గెలుపు కొరకై విస్తృత ప్రచారాన్ని నిర్వహించారు. వివిధ గ్రామాల్లో మాజీ సర్పంచులు, మాజీ కౌన్సిలర్లు, ప్రముఖ నాయకులు, యువ నేతలు, పట్టబద్రులు, టీచర్లు కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని పట్టభద్రుల మరియు టీచర్ల సంక్షేమం కోసం ఉపయోగించుట కొనకై కరపత్రాలను పంపిణీ చేశారు. అనంతరం గుల్షన్ క్లబ్ వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇందిరా గాంధీ గెలుపుకు నాంది పలికిన పలు గ్రామాల్లో పర్యటన చేస్తూ ఉంటే పట్టభద్రుల యొక్క స్వాగతం, నాయకుల యొక్క స్వాగతం, ఉమ్మడి మెదక్ , నిజాంబాద్,అదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి గారి ఘన విజయానికి సంకేతాళు ఇస్తున్నాయన్నారు. గ్రాడ్యుయేట్ల యొక్క భవిష్యత్తుకు బంగారు బాట చూపుతున్న విధంగా అనిపించిందని తెలియజేస్తూ, ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ రెండవ సంఖ్యపై ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచారంలో పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా మెదక్ కాంటెస్టెడ్ ఎంపీ జి సాయ గౌడ్, మెదక్ ఎంఆర్పిఎస్ అధ్యక్షులు కొలుపుల రత్నయ్య మాదిగ, మాజీ సర్పంచులు వెంక గౌడ్, గుట్ట కిందిపల్లి లక్ష్మణ్ యాదవ్, మెదక్ జిల్లా ఇన్చార్జ్ మంగ మోహన్ గౌడ్, యువ నాయకులు జయరాజ్, ఆంజనేయులు, సాయిబాబా గౌడ్ మరియు పట్టబద్రులు పాల్గొన్నారు.
