ఈతరం భారతం హైదరాబాద్ ప్రతినిధి ఏప్రిల్ 28 2024 : చదువుకోవడానికి వయసుతో ఏమాత్రం పనిలేదని నిజాంబాద్ కు చెందిన గుండెల్లి ఎల్లా గౌడ్ నిరూపించారు .ఆయన ప్రస్తుతం 78 ఏళ్ల వయసులో ఓపెన్ స్కూల్ ఇంటర్ పరీక్షలు రాస్తున్నారు .ఎల్లా గౌడ్ బిఎస్ఎన్ఎల్ లో లైన్ ఇన్స్పెక్టర్గా పనిచేసి 2007లో రిటైర్మెంట్ తీసుకున్నారు .ఈనెల 25న ఓపెన్ ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. నిజాంబాద్ నగర శివారులో బోర్గాం పి కేంద్రంలో ఆయన పరీక్షలు రాస్తున్నారు
