వరంగల్ మార్చి 26 (ఈ తరంభారతం); హనుమకొండలోని అంబేద్కర్ భవన్ లో జన శిక్షణ సంస్థాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం మరియు మహిళా పారిశ్రామిక ఉత్పత్తి ఎగ్జిబిషన్ జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వరంగల్ జిల్లా జన శిక్షణ సంస్థాన్ చైర్మన్ రాంబాగ్ ప్రకాష్ గౌడ్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో నడిచే జన శిక్షణ సంస్థాన్ అక్షరాస్యులు, నిరక్షరాస్యులైన ప్రతి మహిళకు వృత్తి నైపుణ్యాలను, సాంకేతిక పరిజ్ఞానo లో శిక్షణ ఇచ్చి మహిళలకు వ్యాపారాలు చేసుకోవడానికి JSS సంస్థ మద్దతు ఇస్తుంది అని అన్నారు.మహిళల నాయకత్వంలో వారి విజయాలను, లక్ష్యాలను సాధించి ఆర్థికంగా బలపడడం సాధించడంలో జన శిక్షణ సంస్థాన్ సహాయపడుతుందని అన్నారు. ప్రపంచంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రతి సంవత్సరం మార్చి 8న జరుపుకునే మహిళలు వరంగల్ జిల్లా మహిళలు మాత్రo మార్చి 8 తో పాటు ఈ రోజు 26 మార్చ్ జరుపుకున్నారు అని అన్నారు. సుమారు 1000 మంది శిక్షణ తీసుకున్న మహిళలకు సర్టిఫికెట్లు అందజేశారు, తరువాత జన శిక్షణ సంస్థాన్ ఉద్యోగులు మరియు బోర్డ్ మెంబెర్స్ ఆధ్వర్యంలో రాంబాగ్ ప్రకాష్ గారికి సన్మానం చేసారు .ఈ కార్యక్రమంలో జన శిక్షణ సంస్థాన్ వైస్ ఏచైర్మన్ డా ” టి. శ్రీనివాస్ రఘు గారు బోర్డ్ మెంబెర్స్, టి పి సి సి లేబర్ సెల్ రాష్ట్ర వైస్ చైర్మన్ నల్ల సంజీవ రెడ్డి రాష్ట్ర మీడియా కో-ఆర్డినేటర్ సప్పిడి భాస్కర్, కాస నర్సింహా యాదవ్, గోకర్ల లక్ష్మి నారాయణ, సిరిపురం నారాయణ, బాషా, తదితరులు పాల్గొన్నారు.
