ఈతరంభారతం జులై 27, జనగాం :జనగాం జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలంలోని చిలుకూరు గుట్ట శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో విధులు నిర్వహిస్తున్న జూనియర్ అసిస్టెంట్ కుర్రముల మోహన్ గౌడ్ విదేశాలకు వెళ్తున్న సందర్భంగా వారికి ఆయన మిత్రులు ఆలేరు పట్టణానికి చెందిన గణగాని రామచందర్ గౌడ్ భక్త బృందం మరియు చొప్పదండి శ్రీధర్ చారి,సురేష్,సందుల శ్రావణ్ గౌడ్,లింగారెడ్డి,గూడూరు శ్రీనివాస్ తదితరుల మిత్రులతో సన్మానించారు. జూనియర్ అసిస్టెంట్ కుర్రముల మోహన్ గౌడ్ కి వేద బ్రాహ్మణులచే ఆశీర్వదించి క్షేమంగా వెళ్లి లాభంగా రావాలని శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఆయనకు ఎల్లపుడు ఉండాలని దీవించారు.














