ఈతరంభారతం జనగామ సెప్టెంబర్ 21 :జనగామ జిల్లా కేంద్రంలోని సానిమేరీ స్కూల్లో తెలంగాణ బతుకమ్మ వేడుకలు వైభవంగా, ఘనంగా జరిగాయి. స్కూల్ కు చెందిన విద్యార్థినులు తమ తరగతి గదులలో తీరొక్క ప్రకృతి పూలతో అందమైన బతుకమ్మలను స్వయంగా నైపుణ్యంతో పేర్చి సంప్రదాయ వస్త్రధారణతో ఉయ్యాల పాటలు పాడుతూ ఆటలు ఆడి తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని చాటిచెప్పారు. బతుకమ్మలను పేర్చి పండుగ వాతావరణం లో వేడుకను ఎంతో ఘనంగా జరిపిన విద్యార్థినులను స్కూల్ యాజమాన్యం తోపాటు ఉపాధ్యాయులు, సిబ్బంది, తల్లిదండ్రులు అభినందించారు.














