EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 1,50,000 Viewership

తప్పిపోయిన బాలుడి అప్పగింత

ఈతరం భారతం అక్టోబర్ 7 మంగళవారం: మహబూబాబాద్ :

మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ బ్లూకోల్ట్స్ కానిస్టేబుల్స్ G. భజన్ లాల్ మరియు శంకర్ లు తెలిపిన వివరాల ప్రకారం మహబూబాబాద్ పట్టణంలోని LBG నగర్ కాలనీ ప్రాంతానికి చెందిన 13 సంవత్సరాల బాలుడు చదువుకోవడం ఇష్టంలేక ఇంట్లో చెప్పకుండా పారిపోవడానికి ఈ రోజు ఉదయం ట్రైన్ ఎక్కి కూర్చుని కంగారు పడుతుండగా ట్రైన్ లోని ఒక ప్రయాణికుడు గమనించి ఆ బాలుణ్ణి అడుగగా తనకు చదువుకోవడం ఇష్టంలేక ఇంట్లో ఎవరికి చెప్పకుండా పారిపోతున్నానని చెప్పగా వెంటనే ఆ ప్రయాణికుడు డయల్ 100 నంబర్ కు కాల్ చేసి మహబూబాబాద్ టౌన్ పోలీసువారికి తెలియపరచినాడు, ట్రైన్ వరంగల్ సమీపంలో ఉండగా టౌన్ ఇన్స్పెక్టర్ గట్ల మహేందర్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం బ్లూకోల్ట్స్ కానిస్టేబుల్స్ కాజీపేట రైల్వే పోలీసులకు సమాచారమివ్వగా ఆ ప్రయాణికుడు బాలుణ్ణి కాజీపేట రైల్వే పోలీసులకు అప్పగించాడు, వెంటనే మహబూబాబాద్ బ్లూకోల్ట్స్ వారు బాలుని యొక్క తల్లి, తండ్రుల వివరాలు, ఫోన్ నంబర్ తెలుసుకుని, సమాచారం అందించారు బాలుని తల్లితండ్రులు కాజీపేట వెళ్లి వాళ్ళ కుమారుణ్ణి తీసుకొచ్చుకున్నారు, తప్పిపోయిన బాలుని విషయంలో తక్షణమే స్పందించిన పోలీసులకు బాలుడి తల్లితండ్రులు కృతఙ్ఞతలు తెలియపరిచారు మరియు బ్లూకోల్ట్స్ సిబ్బందిని ఇన్స్పెక్టర్ గట్ల మహేందర్ రెడ్డి గారు అభినందించినారు.

Related News

Select the Topic
Scroll to Top