ఈతరం భారతం వార్తాంశం :
పంచాంగం ప్రకారం కార్తీక పౌర్ణమి తిథి నవంబర్ 4వ తేదీ రాత్రి 10.30 గంటలకు ప్రారంభమై,5వ తేదీ సాయంత్రం 6.48 గంటలకు ముగుస్తుంది.అయితే,నవంబర్ 5వ తేదీ ఉదయం నుంచి సాయంత్రం వరకు పౌర్ణమి ఘడియల్లో సూర్యోదయం జరుగుతుంది కాబట్టి,ఈ రోజునే కార్తీక పౌర్ణమి జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు. ఈ రోజు సముద్ర స్నానం లేదా నదీ స్నానం చేసి,365 వత్తులతో దీపారాధన చేయడం,కార్తీక నోములు నోచుకోవడం వల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుందని,పరమ శివుడిని ఆరాధిస్తే పుణ్యం లభిస్తుందని పేర్కొంటున్నారు.















