EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

హైదరాబాద్‌ నాంపల్లిలోని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లో అగ్నిప్రమాదం

ఈతరం భారతం హైదరాబాద్ ఫిబ్రవరి 7

హైదరాబాద్‌ నాంపల్లిలోని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లో జరిగిన అగ్నిప్రమాదంపై సెంట్రల్‌ జోన్‌ డీసీపీ శిల్పవల్లి స్పందించారు. నేర పరిశోధనకు సంబంధించిన ఫైల్‌ ఎవిడెన్స్‌ ల్యాబరేటరీ మొత్తం ఇక్కడి నుంచే ఆపరేషన్‌ జరగుతుందని తెలిపారు. ఈ ల్యాబ్‌లోని ఏ ఫైల్స్‌ తగలబడ్డాయో ఇంకా స్పష్టత రాలేదని పేర్కొన్నారు. ఉదయం 10.30 గంటల ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగిందని డీసీపీ శిల్పవల్లి తెలిపారు. మొదటి అంతస్తులో పొగ రావడం గమనించిన ఆఫీస్‌ బాయ్‌.. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించాడని పేర్కొన్నారు. అప్పటికి ఇంకా ఆఫీసు పూర్తిగా ఓపెన్‌ కాకపోవడంతో కేవలం నలుగురు సిబ్బంది మాత్రమే ఉన్నారని.. వారంతా బయటకు వచ్చేశారని చెప్పారు. ఫైర్‌ యాక్సిడెంట్‌పై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని ఐదు ఫైరింజన్లతో మంటలను ఆర్పివేశారని తెలిపారు. ప్రస్తుతం మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయని పేర్కొన్నారు. ఇంకా లోపలికి వెళ్లడానికి కుదరడం లేదని.. ల్యాబ్‌లో ఏ ఫైల్స్‌ తగలబడ్డాయో ఇంకా స్పష్టత రాలేదని చెప్పారు.ఓటుకు నోటు కేసుకు సంబంధించిన కీలక ఆధారాలున్న తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబరేటరీ అగ్నిప్రమాదంలో పలు కీలక ఫైల్స్ దగ్ధమైనట్లు సమాచారం.నేర పరిశోధనకు సంబంధించిన ఫైలు ఎవిడెన్స్ ల్యాబరేటరీ మొత్తం ఇక్కడి నుండే ఆపరేషన్ జరుగుతుంది.ఏ ఫైల్స్ తగలబడ్డాయో ఇంకా స్పష్టత లేదు

 

 

Related News

Select the Topic
Scroll to Top