న్యూ ఢిల్లీ మార్చ్ 10 ఈతరం భారతం:
ఇప్పటి వరకు లోక్ సభలో డిప్యూటీ స్పీకర్ లేరని కాంగ్రెస్ ఎంపి గౌరవ్ గొగొయ్ తెలిపారు. డిప్యూటీ స్పీకర్ లేకుండానే లోక్ సభ నడుస్తోందని అన్నారు. స్పీకర్ ఓం బిర్లాపై విపక్షాల అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిగింది. లోక్ సభ సమావేశాల్లో ఆయన మాట్లాడారు. స్పీకర్ అవిశ్వాస చర్చకు 10 గంటలు కేటాయించారని, అవిశ్వాస తీర్మానంపై నెగ్గాలంటే 278 మంది సభ్యుల మద్దతు, ప్రస్తుతం లోక్ సభలో ఎన్డిఎకు 293 మంది సభ్యుల మద్దతు అవసరం అని అన్నారు. ప్రతిపక్ష సభ్యులు మాట్లాడుతున్నప్పుడు.. స్పీకర్ ఓం బిర్లా తరచూ అంతరాయం కలిగించేవారని, పార్టీలకు అతీతంగా స్పీకర్ వ్యవహరించాలని గౌరవ్ గొగొయ్ సూచించారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రసగంగానికి స్పీకర్ అనుమతించలేదని, 8 మంది విపక్ష సభ్యులను సరైన కారణం లేకుండానే స్పీకర్ ఓ బిర్లా సస్పెండ్ చేశారని విమర్శించారు. ప్రధాని నరేంద్రమోడిపై కాంగ్రెస్ ఎంపిలు దాడి చేసే అవకాశం ఉందని స్పీకర్ తప్పుడు ఆరోపణలు చేశారని, మైక్ ఇవ్వకుంటే విపక్షాల వాణి ప్రజలకు ఎట్లా తెలుస్తుందని ప్రశ్నించారు. లోక్ సభ ఎలా నడుస్తోందో దేశమంతా చూస్తోందని అన్నారు. వ్యక్తిగతంగా స్పీకర్ ఓం బిర్లాపై ఎలాంటి కోపం లేదని గౌరవ్ గొగొయ్ పేర్కొన్నారు.















