EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 1,50,000 Viewership

ఏప్రిల్ 10 వ తేదీ లోపల హాస్టల్ లు, స్కూల్స్, కళాశాలలో అవసరమైన వసతుల కోసం ప్రతిపాదనలు     అధికారులను ఆదేశించిన కలెక్టర్ ప్రావీణ్య 

సంగారెడ్డి మార్చ్ 10 ఈతరం భారతం:

సంగారెడ్డి నియోజకవర్గం లోని ప్రభుత్వ గర్ల్స్ ,బాయ్స్ హాస్టళ్లు, హై స్కూల్ లు, జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీల లో బాత్ రూమ్ లు, అదనపు గదులు, స్వంత భవనాలు, మంచి నీటి వసతుల కల్పన కోసం కలెక్టర్ ప్రావీణ్య, నిర్మల, జగ్గారెడ్డి రివ్యూ సమావేశం నిర్వహించారు, ఏప్రిల్ 10 వ తేదీ లోపల హాస్టల్ లు, స్కూల్స్, కళాశాలలో అవసరమైన వసతుల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేసి తనకు సమర్పించాలని అధికారులను కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో వసతుల కల్పన కోసం 60 శాతం పరిశ్రమల సిఎస్ఆర్ నిధులతో పాటు 40 శాతం నిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో తీసుకువస్తామని జగ్గారెడ్డి, నిర్మల తెలిపారు. కలెక్టర్ రివ్యూ సమావేశం లో పాల్గొన్న సిపిఒ, బిసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ అధికారులు, అన్ని జూనియర్ , డిగ్రీ కలశాల ప్రిన్సిపల్స్ . కూన సంతోష్, మున్సిపల్ చైర్మన్ వనిత, వైస్ చైర్మన్ షఫీ, సదాశివపేట మున్సిపల్ చైర్మన్ మునిపల్లె సత్యనారాయణ, వైస్ చైర్మన్ చిరు, నియోజకవర్గ ఇంచార్జి ఆంజనేయులు, సిడిసి చైర్మెన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రామ్ రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు చిదృ ప్పా రఘు గౌడ్, సదాశివపేట మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సింహ రెడ్డి, పార్టీ అధ్యక్షు లు జార్జ్, సిద్దన్న, బుచ్చి రాములు, మోతి, కంది సర్పంచ్ శ్రీరామ్ లతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top