EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 1,50,000 Viewership

ఆయుధాల దిగుమతుల్లో భారత్‌ నం.2

ఈతరం భారతం న్యూఢిల్లీ మార్చ్ 10:

ఆయుధాల దిగుమతిలో ప్రపంచంలోనే భారత్‌ రెండో స్థానంలో ఉన్నది. 2021-25 మధ్య కాలంలో ప్రపంచంలో మొత్తం ఆయుధ దిగుమతుల్లో భారత్‌ వాటా 8.3 శాతం. మొదటి స్థానంలో ఉక్రెయిన్‌ (9.1 శాతం) ఉన్నది. స్టాక్‌హోమ్‌ ఇంటర్నేషనల్‌ పీస్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌(సిప్రి) తాజా నివేదికలో ఈ వివరాలు వెల్లడించింది.ఇదివరకు రష్యా నుంచి అధికంగా ఆయుధాలను కొనుగోలు చేసిన భారత్‌.. క్రమంగా ఫ్రాన్స్‌, ఇజ్రాయెల్‌, అమెరికా లాంటి పాశ్చాత్య దేశాలవైపు మళ్లుతున్నదని సిప్రి తెలిపింది. అయినప్పటికీ రష్యా నుంచి అధికంగా ఆయుధాలు కొనుగోలు చేస్తున్న దేశం భారతేనని వివరించింది.

Related News

Select the Topic
Scroll to Top