ఈతరం భారతం ఓవర్సీస్ న్యూస్ మార్చ్ 11
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి. ఇజ్రాయెల్ భూభాగాన్ని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ అత్యంత శక్తివంతమైన మెరుపు దాడులకు దిగింది. దాదాపు ఒక టన్ను బరువున్న భారీ వార్‌హెడ్లతో కూడిన క్షిపణులను ఇరాన్ ప్రయోగించడంతో ఇజ్రాయెల్ వ్యాప్తంగా యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ దాడులతో ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ సహా పలు ప్రధాన నగరాలు దద్దరిల్లాయి.ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) ప్రయోగించిన క్షిపణులు హోలోన్ ఇండస్ట్రియల్ ఏరియాపై విరుచుకుపడ్డాయి. అలాగే, కీలకమైన హైఫాలోని పవర్ స్టేషన్‌ను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగాయి. ఈ బాంబు దాడుల ధాటికి పలు భవనాలు కుప్పకూలాయి, విద్యుత్ వ్యవస్థకు తీవ్ర నష్టం వాటిల్లింది. క్షిపణుల సైరన్ల మోతతో భీతిల్లిన ఇజ్రాయెల్ పౌరులు ప్రాణరక్షణ కోసం భూగర్భ బంకర్లలో తలదాచుకుంటున్నారు. ఈ భీకర దాడులకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇజ్రాయెల్ కూడా ప్రతిదాడికి సిద్ధమవుతుండటంతో ప్రపంచ దేశాల్లో ఆందోళన మొదలైంది















