ఈతరం భారతం ఖమ్మం మార్చ్ 16
భక్తులకు శుభవార్త. టీజీఎస్ ఆర్టీసీ ఖమ్మం డిపో నుంచి Wadapally Sri Venkateswara Swamy Temple లో జరిగే ఏడు వారాల వెంకన్న స్వామి దర్శనానికి ప్రత్యేక బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ శివప్రసాద్ తెలిపారు.భక్తులు భారీగా వాడపల్లి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్తున్న నేపథ్యంలో, ఖమ్మం డిపో నుంచి ప్రతి శుక్రవారం రాత్రి ప్రత్యేక డీలక్స్ బస్సు నడపాలని నిర్ణయించారు. ఈ బస్సు ఖమ్మం నూతన బస్టాండ్ నుండి ప్రతి శుక్రవారం (20-03-2026) రాత్రి 8.00 గంటలకు బయలుదేరి, శనివారం తెల్లవారుజామున 2.00 గంటలకు వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి చేరుకుంటుంది.భక్తులందరూ స్వామివారి దర్శనం చేసుకున్న అనంతరం ఉదయం వాడపల్లి నుంచి తిరిగి బయలుదేరి ఖమ్మం చేరుకుంటారు. ఈ సర్వీసుకు రాను–పోను పూర్తి ట్రిప్ ఛార్జీ పెద్దలకు రూ.900, పిల్లలకు రూ.470గా నిర్ణయించారు.ఖమ్మం, వైరా, తల్లాడ, కల్లూరు పరిసర ప్రాంత భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు.మరింత సమాచారం కోసం 9136446666 నంబర్‌కు ఫోన్ చేస్తే వివరాలు అందించడంతో పాటు ఇంటి వద్ద నుంచే సీటు బుకింగ్ సౌకర్యం కూడా కల్పిస్తారు. అలాగే ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ కోసం TGSRTC Online Ticket Booking Portal www.tgsrtcbus.in వెబ్‌సైట్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చని తెలిపారు.















