హైదరాబాద్ మార్చ్ 17 ఈతరం భారతం:
స్పీకర్ గారు…మజ్లిస్ నేతల ‘‘వందేమాతరం’’ ఉల్లంఘనపై చర్యలేవి?అనికేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలంగాణా రాష్ట్ర స్పెకర్ ను ప్రశ్నించారు.రాజ్యాంగబద్ద పదవిలో ఉన్నారనే విషయం మర్చిపోయారా?వందేమాతరం గేయం ఆలపించేటప్పుడు తప్పనిసరిగా సభ్యులంతా లేచి నిలబడి గౌరవించాలనే సంగతి తెలియదా?పవిత్రమైన అసెంబ్లీ వేదికగా మజ్లిస్ నేతలు వందేమాతరం గేయాన్ని అవమానిస్తే ప్రేక్షక పాత్ర వహించడమేంటి?రాజ్యాంగ పరిరక్షకులైన గవర్నర్, స్పీకర్, మండలి ఛైర్మన్ సాక్షిగా మజ్లిస్ నేతలు ‘‘వందేమాతరం’’ గేయాన్ని అవమానించినా మీకు పట్టదా?రాష్ట్రపతి, గవర్నర్ అధికారిక కార్యక్రమాల్లో వందేమాతరం తప్పనిసరి చేస్తూ 2026లోనే కేంద్రం ఉత్తర్వులిచ్చిన విషయం మర్చిపోయారా?వందేమాతరం గేయ ఆలాపాన సమయంలో అసెంబ్లీ నుండి వాకౌట్ చేసిన మజ్లిస్ నేతలకు ఇంతవరకు ఎందుకు నోటీసులు ఇవ్వలేదు?కాంగ్రెస్ పార్టీకి మజ్లిస్ దోస్త్ కాబట్టి నోటీసులివ్వడానికి భయపడుతున్నారా?ఎమ్మెల్యేల ఫిరాయింపుల విషయంలో స్పీకర్ గారు ఇచ్చిన తీర్పుతో శాసన వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం సడలిందిస్పీకర్ సాక్షిగా నిండు సభలోనే మజ్లిస్ ఎమ్మెల్యేలు వందేమాతరం అవమానించినా చర్యలు తీసుకోవడం లేదంటే ఏమనుకోవాలి?సీఎం రేవంత్ రెడ్డి గారు…మజ్లిస్ నేతలు ‘‘వందేమాతరం’’ను అవమానిస్తున్నప్పుడు మీతోసహా మంత్రులంతా సభలోనే ఉన్నారు కదా?సభ నియమ నిబంధనలను, కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులను అమలు చేయాల్సిన బాధ్యత మీకు లేదా?మీ నాయకుడు రాహుల్ గాంధీ రాజ్యాంగ పుస్తకాన్ని రోజు చేతిలో పట్టుకుని తిరుగుతున్నారు కదా? కి అనుగుణంగా ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయాలనే సోయి మీ ప్రభుత్వానికి లేదా? రాష్ట్రంలో మొట్టమొదటి రాజ్యాంగ పరిరక్షుడైన గవర్నర్ గారి సమక్షంలోనే ఉల్లంఘన జరిగినా చర్యలు తీసుకోకపోతే ప్రజల్లోకి ఏ సందేశాలు పంపుతున్నారు?కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘించిన మజ్లిస్ ఎమ్మెల్యేలపై తక్షణమే చర్యలకు ఆదేశించండని విజ్ఞప్తి చేసారు
.















