ఈతరం భారతం హైదరాబాద్ మార్చ్ 19:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సినిమా రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రజా యుద్ధనౌక గద్దర్ పేరుతో ఏర్పాటు చేసిన ‘గద్దర్ ఫిల్మ్ అవార్డుల’ వేడుక హైదరాబాద్‌లోని మాదాపూర్ హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్‌లో, తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రముఖ నటుడు చిరంజీవి జ్యోతి వెలిగించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గద్దర్ అవార్డ్స్ సావనీర్‌ను ఆవిష్కరించారు. 2025లో విడుదలై ఉత్తమ ప్రతిభ కనబరిచిన సినిమాలకు అవార్డులు ప్రకటించారు.గద్దర్ తనయుడు సూర్య కిరణ్ మాట్లాడుతూ.. గద్దర్ తో పనిచేసిన చాలా మంది అవార్డులు అందుకుంటున్నారు. చిరంజీవితో పాటు ఎంతోమంది ప్రముఖులు అవార్డులు అందుకోవటం ఆనందంగా ఉంది. గద్దర్ అవార్డులను ఇంత గొప్పగా నిర్వహించడం ఆనందంగా ఉందని అన్నారు. లిటిల్ హార్ట్ సినిమాకు అవార్డు రావడం ఆనందం వ్యక్తం చేశారు దర్శకుడు సాయి మార్తాండ్‌గద్దర్ అవార్డ్స్ జ్యూరీకి ధన్యవాదాలు తెలిపాడు . అలాగే గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ మాట్లాడుతూ.. సీ నారాయణరెడ్డి పేరు మీద ప్రకటించిన తొలి అవార్డు నాకు అందించటం ఆనందంగా ఉంది.ఉగాది రోజు గద్దర్ అవార్డు ఇవ్వటం ఆనందంగా ఉందని అన్నారు. అలాగే దర్శకుడు గుణశేఖర్ మాట్లాడుతూ.. రెండోసారి ఈ అవార్డు అందుకుంటున్నా.. ఎంపిక చేసిన వారికి ధన్యవాదాలు అన్నారు.















