EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

కామెంట్ చేసిన తర్వాత ఎడిట్ చేసుకునే ఛాన్స్.. కొత్త ఫీచర్ లాంచ్!

ఈతరం భారతం భాగ్యనగరం ఏప్రిల్ 11

ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారుల కోసం మరో ఉపయోగకరమైన ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. సాధారణంగా ఏదైనా పోస్ట్‌పై కామెంట్ చేసినప్పుడు స్పెల్లింగ్ తప్పులు దొర్లినా లేదా సమాచారం మార్చాలన్నా ఆ కామెంట్‌ను డిలీట్ చేసి మళ్ళీ కొత్తగా చేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు నేరుగా కామెంట్‌ను సవరించుకునే వెసులుబాటును సంస్థ కల్పించింది.వినియోగదారులు తమ కామెంట్‌ను పోస్ట్ చేసిన 15 నిమిషాల లోపు ఎప్పుడైనా సవరించుకోవచ్చు. ఈ నిర్ణీత సమయంలో ఎన్నిసార్లైనా మార్పులు చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఈ ఫీచర్ కేవలం టెక్స్ట్ కు మాత్రమే పరిమితం. కామెంట్లలో ఉపయోగించే ఫోటోలు, GIFలు లేదా స్టిక్కర్లను మార్చడం కుదరదు. ఏదైనా మార్పు చేసినప్పుడు సదరు కామెంట్ పక్కన ‘Edited’ అనే ట్యాగ్ కనిపిస్తుంది. దీనివల్ల ఆ కామెంట్‌ను సవరించినట్లు ఇతరులకు తెలుస్తుంది, కానీ గతంలో ఉన్న అసలు కామెంట్ మాత్రం ఎవరికీ కనిపించదు.వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరచడంలో భాగంగా ఇన్‌స్టాగ్రామ్ ఈ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. వాట్సాప్, ఫేస్‌బుక్ వంటి యాప్‌లలో ఇప్పటికే ఈ తరహా ఫీచర్ అందుబాటులో ఉంది. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఈ సదుపాయం రావడంతో పొరపాట్లు సరిదిద్దుకోవడం సులభం కానుంది. ప్రస్తుతం ఈ అప్‌డేట్ ప్రపంచవ్యాప్తంగా దశలవారీగా రోల్ అవుట్ అవుతోంది.

Related News

Select the Topic
Scroll to Top