EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

ఫోన్‌పే యూజర్లకు బిగ్ అలర్ట్

ఈతరం భారతం వార్తాంశం

ఫోన్‌పే హెల్ప్ పేజీలో సమాచారం ప్రకారం.. ఒక వ్యాలెట్ వరుసగా 365 రోజుల పాటు వాడకపోతే.. అకౌంట్ ఇన్‌యాక్టివ్ అవుతుంది. ఒకసారి వ్యాలెట్ ఇన్ యాక్టివ్ కేటగిరీలోకి వెళ్లాక ఇన్‌యాక్టివ్ మెయింటెన్స్ ఫీజు అప్లయ్ అవుతుంది.ఈ క్రమంలోనే ముందుగా కంపెనీ యూజర్లకు మెసేజ్‌లు పంపుతుంది. ఈ ఇన్‌యాక్టివ్ రుసుము త్రైమాసికానికి రూ. 100 ఉంటుంది. మీ వాలెట్‌లో తగినంత ఫండ్స్ ఉన్నప్పుడు మాత్రమే మీ వాలెట్ నుంచి ఆటోమాటిక్ గా డెబిట్ అవుతుంది.

ఫోన్‌పే నోటిఫికేషన్ అందుకున్న చాలామంది వినియోగదారులు వాటి స్క్రీన్‌షాట్‌లను షేర్ చేశాకే ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ మెసేజ్‌లలో ఇన్ యాక్టివ్ సంబంధిత ఛార్జీలను నివారించేందుకు వెంటనే రీఛార్జ్ చేయాలి లేదా తమ వ్యాలెట్లను వాడుకోవాలని అందులో సూచించినట్లు చెబుతున్నారు. అయితే, ఈ స్క్రీన్‌షాట్‌లు ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్నాయి.

డిజిటల్ వాలెట్‌లను చాలా తక్కువగా వాడే యూజర్లకు ఇలాంటి రుసుము ఎంతవరకు న్యాయం అనేదానిపై చర్చలు మొదలయ్యాయి. ఫోన్‌పే నుంచి మెసేజ్ అందుకున్న యూజర్లలో టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ కూడా ఒకరు. ఆయన ఆ SMSను అధికారిక ఎక్స్ హ్యాండిల్ ద్వారా ఆన్‌లైన్‌లో షేర్ చేశారు.

ప్రతి త్రైమాసికంలో రూ. 100 ఛార్జీలు :

12 నెలలు ఇన్‌యాక్టివ్ వ్యాలెట్లకు ప్రతి త్రైమాసికానికి రూ. 100 చొప్పున ఛార్జీ విధించనున్నట్టు యూజర్లను ఫోన్‌పే హెచ్చరించింది. చాలా మంది ఫోన్‌పే వాలెట్లను అసలు వాడరు. కేవలం బ్యాంక్ ఖాతా నుంచి నేరుగా యూపీఐని వాడుతారు. అసలు వారికి ఒక వాలెట్ అనే అకౌంట్ ఉందని కూడా తెలియకపోవచ్చు.ఇదిలా ఉంటే.. ఫోన్ పే వాలెట్ క్లోజ్ చేయాలని చూస్తే ఫుల్ కేవైసీ అడుగుతోందని యూజర్లు చెబుతున్నారు. అసలు వాడని ఈ ఫీచర్‌కు ఛార్జీలు విధించడం.. వాలెట్ క్లోజ్ చేసే అవకాశం లేకుండా చేయడమేంటి? అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఒకవేళ ఈ సర్వీసు వాడాలనుకుంటే వ్యాలెట్ బ్యాలెన్స్‌లను ఖాళీ చేయడమే బెటర్ మరికొందరు అంటున్నారు. వాలెట్ వాడకపోయినా మెయింట్ నెస్స్ ఫీజు ఎందుకు చెల్లించాలని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

ఫోన్‌పే నిబంధనల ప్రకారం.. ఈ పెనాల్టీ కేవలం వాలెట్‌లోని బ్యాలెన్స్‌పై మాత్రమే ఎఫెక్ట్ పడుతుంది. బ్యాంకు ఖాతాలతో జరిగే యూపీఐ పేమెంట్లపై ఎలాంటి ప్రభావం పడదు. ఇన్ యాక్టివ్ యూపీఐ అకౌంట్లపై కూడా ఈ ఛార్జీ విధించే అవకాశం ఉంది.

Related News

Select the Topic
Scroll to Top