ఈతరం భారతం హైద్రాబాద్ జూన్29 :
తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్‌తోనే అభివృద్ధి సాధ్యమని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ అన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని సంపూర్ణ విశ్వాసం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలోని యువత రాజకీయాల్లోకి రావాలన్న ఆయన వచ్చాక ఏం చేస్తారో ఓ స్పష్టత ఉండాలని సూచించారు. గతంలో మానవ హక్కుల గురించి ప్రజలకు అంతగా తెలిసేది కాదన్న నితిన్ సోషల్ మీడియా వచ్చాక ప్రజల్లో చైతన్యం పెరిగిందన్నారు. హక్కులు, విధుల పట్ల ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.మేడ్చల్-మల్కాజ్ గిరి జిల్లాలోని ఘట్ కేసర్ వీబీఐటీ క్యాంపస్‌లో బీజేపీ యువ మోర్చా ఆధ్వర్యంలో వికసిత్ భారత్ స్టూడెంట్స్ కాంక్లేవ్‌లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. కాంక్లేవ్‌లో నల్సార్, ఐఎస్బీ, హెచ్‌సీయూ, కేయూ, ఓయూ, ఐఐటీ, ఐఐఐటీ, ఎన్ఐటీ, ఇఫ్లూ, బిట్స్ విద్యార్థులు పాల్గొన్నారు.















