ఈతరం భారతం న్యూఢిల్లీ జూన్ 29
దేశ రాజధానిలో కాలుష్య నియంత్రణ చర్యలలో భాగంగా విద్యుత్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా ఢిల్లీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ‘ ఢిల్లీ ఈవీ పాలసీ 2026 ’కు క్యాబినెట్ ఆమోదం తెలిపినట్టు ముఖ్యమంత్రి రేఖా గుప్తా సోమవారం వెల్లడించారు. జూలై 1 నుంచి అమల్లోకి వచ్చే ఈ విధానం… 2030 మార్చి 31 వరకు కొనసాగుతుందని ఆమె తెలిపారు. కొత్త పాలసీ ద్వారా రాబోయే నాలుగేళ్లలో పౌరులకు దాదాపు రూ. 15,000 కోట్ల మేర ప్రయోజనాలు చేకూరుతాయని ముఖ్యమంత్రి వివరించారు. ఇందులో భాగంగా నేరుగా రూ. 7 వేల కోట్లతో ఛార్జింగ్ స్టేషన్లు వంటి మౌలిక సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం ఖర్చు చేయనుంది. మరో రూ. 8 వేల కోట్లను పన్ను మినహాయింపులు, ప్రోత్సాహకాల రూపంలో అందజేయనుంది.















