ఈతరం భారతం వాణిజ్యాంశం:
టాటా మోటార్స్ ఇటీవల మార్కెట్లోకి సరికొత్త సియెర్రా ఈవీ (Sierra EV) కారును లాంచ్ చేసి తన ఎలక్ట్రిక్ వెహికల్ (EV) పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరించింది. ఈ నేపథ్యంలో జూలై నెలకు గానూ టాటా మోటార్స్ తన ఈవీ పోర్ట్‌ఫోలియోపై భారీ డిస్కౌంట్లను అనౌన్స్ చేసింది.సేల్స్ పెంచడంతో పాటు అమ్ముడుపోకుండా మిగిలిపోయిన పాత స్టాక్ క్లియర్ చేయడం కోసం ఈ ఆఫర్లను తీసుకొచ్చింది. అయితే ఈ డిస్కౌంట్లు అన్ని కార్లపై ఒకేలా లేవు. ఇందులో క్యాష్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బోనస్, ఇంటర్వెన్షన్ బోనస్, లాయల్టీ బోనస్ వంటివి కలిసి ఉన్నాయి. మీ సమీపంలోని టాటా డీలర్‌షిప్‌ను సందర్శిస్తే ఖచ్చితమైన ఆఫర్ల వివరాలు తెలుస్తాయి.
నెక్సాన్ ఈవీపై రూ. 50,000 వరకు ఆఫర్
టాటా మోటార్స్ కార్లలో అత్యధికంగా అమ్ముడయ్యే మోడల్స్‌లో నెక్సాన్ ఈవీ ఒకటి. అందుకే దీనిపై కంపెనీ తక్కువ డిస్కౌంట్ ఇస్తోంది. నెక్సాన్ ఈవీ సేల్స్ మరింత పెంచడానికి అన్ని వేరియంట్లపై రూ. 50,000 వరకు టోటల్ డిస్కౌంట్ లభిస్తోంది. ఇందులో రూ. 15,000 క్యాష్ డిస్కౌంట్ ఉండగా.. మిగిలిన రూ. 35,000 వరకు ఎక్స్ఛేంజ్ లేదా స్క్రాపేజ్ బోనస్ రూపంలో అందుతోంది
టియాగో ఈవీపై రూ. 1.45 లక్షల వరకు తగ్గింపు
టాటా మోటార్స్ ఇటీవలే టియాగో ఈవీని సరికొత్త ఫేస్‌లిఫ్ట్ రూపంలో, ఇంటీరియర్ మొత్తాన్ని మార్చేసి మార్కెట్లోకి తెచ్చింది. అయితే, ఫేస్‌లిఫ్ట్‌కు ముందు వచ్చిన పాత మోడల్ పై కంపెనీ ఏకంగా రూ. 1.45 లక్షల వరకు భారీ డిస్కౌంట్లను ఇస్తోంది. ఇందులో అన్ని మీడియం రేంజ్ వేరియంట్లపై రూ. 40,000 క్యాష్ డిస్కౌంట్‌తో కలిపి మొత్తం రూ. 65,000 వరకు బెనిఫిట్స్ వస్తాయి. ఇక లాంగ్ రేంజ్ వేరియంట్ల విషయానికి వస్తే.. ట్రిమ్ ఆధారంగా రూ. 1 లక్ష వరకు క్యాష్ డిస్కౌంట్, రూ. 25,000 ఎక్స్ఛేంజ్/స్క్రాపేజ్ బోనస్, రూ. 50,000 ఇంటర్వెన్షన్ బెనిఫిట్ లభిస్తాయి
పంచ్ ఈవీ పాత మోడల్‌పై రూ. 1.45 లక్షల వరకు బెనిఫిట్స్
టాటా మోటార్స్ ఈ ఏడాది ప్రారంభంలోనే పంచ్ ఈవీని అప్డేట్ చేసింది. దీంతో సేల్స్ పెంచేందుకు, పాత స్టాక్ క్లియర్ చేసేందుకు ఈ పాత మోడల్ పై క్రేజీ ఆఫర్లను ప్రకటించింది. పంచ్ ఈవీ లాంగ్ రేంజ్ వేరియంట్లపై గరిష్ఠంగా రూ. 1.45 లక్షల వరకు ప్రయోజనాలు అందుకోవచ్చు, ఇందులో రూ. 1.1 లక్షల భారీ క్యాష్ డిస్కౌంట్ కూడా ఉంది. ఇక మీడియం రేంజ్ వేరియంట్లపై ట్రిమ్స్‌ను బట్టి రూ. 1.25 లక్షల వరకు మొత్తం బెనిఫిట్స్ లభిస్తుండగా, అందులో రూ. 90,000 వరకు క్యాష్ డిస్కౌంట్ రూపంలోనే అందుతుంది
హారియర్ ఈవీపై రూ. 2.75 లక్షల భారీ ఆఫర్
టాటా కంపెనీకి చెందిన ఫ్లాగ్షిప్ ఎలక్ట్రిక్ కారు హారియర్ ఈవీపై ఏకంగా రూ. 2.75 లక్షల వరకు డిస్కౌంట్ లభిస్తోంది. కానీ ఈ లిస్ట్‌లోని మిగతా కార్లలా కాకుండా, జూలై నెలకు గానూ హారియర్ ఈవీపై ఎలాంటి డైరెక్ట్ క్యాష్ డిస్కౌంట్లు లేవు. దీనికి బదులుగా రూ. 1 లక్ష వరకు ఇంటర్వెన్షన్ బెనిఫిట్, రూ. 1 లక్ష వరకు లాయల్టీ బోనస్, అలాగే రూ. 75,000 వరకు స్క్రాపేజ్ లేదా ఎక్స్ఛేంజ్ బోనస్ అందిస్తున్నారు
కర్వ్ ఈవీపై అత్యధికంగా రూ. 3.35 లక్షల డిస్కౌంట్
టాటా ఈవీ కార్లన్నింటిలోకి ఎప్పుడూ అత్యధిక డిస్కౌంట్లు పొందే కారు ఏదైనా ఉందంటే అది కర్వ్ ఈవీ మాత్రమే. ఈ సారి కూడా దీనిపై రికార్డు స్థాయిలో రూ. 3.35 లక్షల వరకు ఆఫర్ ప్రకటించారు. అయితే ఈ భారీ డిస్కౌంట్లు మే 2026లో వచ్చిన ఎక్స్ సిరీస్ అప్డేట్కు ముందున్న కర్వ్ ఈవీ వేరియంట్లకు మాత్రమే వర్తిస్తాయి. కర్వ్ ఈవీపై ఇచ్చే క్యాష్ డిస్కౌంట్ విలువ మాత్రమే రూ. 3 లక్షల వరకు ఉంది.















