EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

ప్రభుత్వం దిగివచ్చేంత వరకు దశలవారీగా ఆందోళనలు :ఎంపీ ఆర్ కృష్ణయ్య

ఈతరం భారతం హైద్రాబాద్ జులై 8:

ఫీజు బకాయిల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగివచ్చేంత వరకు దశలవారీగా ఆందోళనలు కొనసాగిస్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య తెలిపారు. బుధవారం బీసీ యువజన సంఘం ఆద్వర్యం లో బషీర్ బాగ్ ఫ్లై ఓవర్ నుండి జగ్జీవన్ రామ్ విగ్రహం వరకు నిర్వహించిన ఫీజుల బకాయిలు తిరుగుబాటు ప్రదర్శన కు ఎంపీ ఆర్ కృష్ణయ్య ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యాశాఖను దగ్గర పెట్టుకుని… ప్రభుత్వ విద్యావ్యవస్థను గొడ్డలితో నరుకుతూ పూర్తిగా నిర్వర్యం చేస్తున్నారని కృష్ణయ్య తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రేవంత్ రెడ్డి వైఖరి వల్ల విద్యావ్యవస్థ గాడి తప్పుతుందని విమర్శించారు. తక్షణమే పెండింగ్ లో ఉన్న 8 వేల కోట్లు ఫీజు బకాయిలను విడుదల చేసి , పథకాన్ని యధావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు.

Related News

Select the Topic
Scroll to Top