ఈతరం భారతం హైద్రాబాద్ జూలై 8:
తుంగతుర్తినియోజకవర్గంలో కొత్తగా ప్రకటించిన మండల స్థాయి కాంగ్రెస్ కమిటీలను వ్యతిరేకిస్తూ సీనియర్ కాంగ్రెస్ నాయకులు, సర్పంచ్‌లు, ఉపసర్పంచ్లు, వార్డు సభ్యులు, కార్యకర్తలు ఆందోళన చేపట్టారు.
ఏళ్ల తరబడి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన వారిని పక్కనబెట్టి, ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన వారికి పార్టీ పదవులు ఇవ్వడం అన్యాయమని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీనియర్ కాంగ్రెస్ నాయకులపై నమోదైన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని, మండల కమిటీలను రద్దు చేసి నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలతో కొత్త కమిటీలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.ఆందోళన సందర్భంగా ఎమ్మెల్యే మందుల సామేల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, కాంగ్రెస్ పార్టీని కాపాడాలని పార్టీ అధిష్ఠానాన్ని కోరారు.















