ఈతరం భారతం సంగా రెడ్డి జులై 8 :
టీజిఐఐసి చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి బుధవారం సంగారెడ్డి మున్సిపాలిటీ లో రూ. 4 కోట్లతో చేపట్టిన సిసి రోడ్ పనులను ప్రారంభించారు. 11 వ వార్డు లోని శిల్పా వెంచర్ సిసి రోడ్ పనులను ప్రారంభించారు. అనంతరం 33 వ వార్డు, 28 వార్డుల్లో సిసి రోడ్ పనులను సైతం ఆమె ప్రారంభించారు.
ఈ సందర్భంగా నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ జగ్గారెడ్డి సహకారం తో సంగారెడ్డి మున్సిపాలిటీ లో పనులు ప్రారంభమవుతున్నాయని, రానున్న కాలంలో మరిన్ని నిధులతో సంగారెడ్డి లో ప్రతీ వార్డ్ లో అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతామన్నరు
ఈ కార్యక్రమం లోమున్సిపల్ చైర్మన్ కూన వనితా సంతోష్, కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, డి ఈ రఘు రాథోడ్,, బ్లాక్ ప్రెసిడెంట్ జార్జ్, నాయకులు కూన సంతోష్, టౌన్ ప్రెసిడెంట్ కిరణ్ గౌడ్ , నాయకులు మహేష్, రవి నాయక్, తులసి రామ్, దశరథ్ రెడ్డి, శైలేష్ రెడ్డి, శ్రీశైలం, సతిశ్ రెడ్డి, నవాజ్, అశ్విన్, కో ఆప్షన్ సభ్యులు బబ్బు, తదితరులు పాల్గొన్నారు.















