EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

రూ.1.10 లక్షలు…. పది రూపాయల నాణేలతో…బస్తాల్లో తీసుకెళ్లి మరీ బైక్ కొనుగోలు చేసిన వ్యక్తి

ఈతరం భారతం చిట్యాల జూలై 8

మార్కెట్లో 10 రూపాయల నాణేల చెల్లుబాటుపై అవగాహన కల్పించేందుకు యాదాద్రి భువనగిరి జిల్లా వెలిమినేడుకు చెందిన కొండె రఘుపతి ఒక వినూత్న ప్రయత్నం చేశాడు. చిట్యాలలోని శ్రీ వినాయక మోటార్స్ నుంచి స్ప్లెండర్ ప్లస్ ద్విచక్రవాహనాన్ని కొనుగోలు చేసిన రఘుపతి.. అందుకోసం ఏకంగా రూ. 1.10 లక్షల మొత్తాన్ని కేవలం రూ. 10 కాయిన్స్ రూపంలోనే చెల్లించాడు. షోరూమ్ సిబ్బంది ఈ మొత్తాన్ని ఓపికగా లెక్కించి అతడికి సరికొత్త బైక్‌ను అప్పగించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

Related News

Select the Topic
Scroll to Top